16, జనవరి 2016, శనివారం

సమీక్షలు

"ప్రజల పక్షాన నిలబడే మంత్ర లిపి 
.....................................................

 ప్రజల కోసం పుట్టే రచన ఎప్పుడు అజరామరమే, సాహిత్యం లో ఎన్ని వాదాలు వచ్చినా, ప్రజల పక్షం వహించి నిలబడేవి కొన్ని మాత్రమె, అవే పది కాలాల పాటు మిగులుతాయి.
 ఆలాంటి కోవ లో కి చెందిన పుస్తకమే కొనకంచి లక్ష్మి నరసింహ రావు గారు రాసిన  "మంత్ర లిపి ". 
 ఈ అక్షర లిపి కి చైతన్య పరిచే గుణం ఉన్నది.  మంత్రలిపి అక్షరాలను  ని చేతుల్లోకి  తీసుకొని చూసినప్పుడు చీకటి చీల్చే వెలుగు కిరణం లా అగుపడింది  .."బతకటం కోసం పరిగెత్తి తమంతట తామే చావు కౌగిట్లో చేరి తెల్లారిపోతారు(మంత్రం లిపి)" అన్నప్పుడు మనిషి జీవితం ఎంత సంక్లిష్టం. ఇదే కవితలో ఈ దేశ స్థితి ని ఎండగడుతూ ఇలా,
 "అమ్మక ద్రోహం మా ఇంటి పేరు , 
లంచం మా జన్మ హక్కు, 
అవీనితి మా జాతీయ సంపద// 
దేశం అంటే ఉట్టీ మట్టి//
మనిషి అంటే పిడికెడు నల్ల బూడిద " 
అని  ఈ దేశం లో పాతుకుపోయిన అవినీతి ని ఎండగడతారు .. 
చావు బతుకుల మద్య చిన్న విరామ చిహ్నమే జీవితం అన్నప్పుడు, నిజమైన స్వేచ్చ అంటే స్వేచ్చ లేకుండా బతకటమే అన్న విరక్తి ని వైయుక్తికాన్ని మేళవించి చెప్పడం లో ఎంత అనుబవం వుండాలి "అప్పుడు ఎప్పుడో ఒకసారి" లో నీ గుర్తు పద్యమై , గద్యమై కొత్త రహదారి గా మిగిలిపోతాను, గగనాన్ని ప్రశ్నిస్తూ కొండ శిఖరం లా మిగిలిపోతాను అని మనల్ని పునరాలోచన చెయ్యమంటారు.  

మనిషి అంటే ఎవరు, ఎవరైనా కావొచ్చు కాని ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతు మాత్రం ఈ దేశం లో ఓ అబద్దం గా మారడమే విషాదం.  
అవును ఇక్కడ "రైతు పండించే దాన్యం నిజం, రైతు మాత్రం అబద్దం", 
 నేను అన్నం తిందామనుకుంటున్న ప్రతి సారి నా కంచం లో ఏ కన్న తల్లి వో రెండు కన్నీటి బొట్లు జారిపడి మెరుస్తూ కనిపిస్తున్నాయి //
ఆత్మాహత్య చేసుకున్న రైతు బార్యవో/
రోదిస్తూ తెగిపడ్డ పుస్తెలు కనిపిస్తున్నాయి 
అని దేశం లో రైతు బతుకు బాధలను ..రాజ్యం రైతు పట్ల చూపిస్తున్న వివక్షత ను నిరసిస్తారు. 
 "పునరపి మరణం, పునరపి జననం " నిత్య సత్యం ఇది.మరణం అంచులలో మనిషి మానసిక స్థితి ఏంటి, మృత్యువు లేని చోట ఎక్కడ, బతుకున్నప్పుడు  చేసిన కర్మ ఫలాన్ని తలచుకుంటూ రోగగ్రస్తమైన జీవితాన్ని ప్రేమ తో దగ్గర కి తీసుకునే స్మశానం మే నీకు మారు తల్లి..నిజమే ...మనిషి మనుగడ జీవిక ఉన్నతవరకే ఆ తరువాత అంతా  శూన్యమే ..
"నిన్ను నవమాసాలు కడుపు న  మోసి పెంచిన కన్న తలి అమ్మ, నిన్ను ప్రేమతో తన కడుపు లో కి తీసుకున్న మారు తల్లి స్మశానం/ఇద్దరమ్మ ల మధ్య మనిషి ప్రయాణమే జీవితం(మరణానికి ముందు ఎవరైనా) " అనగల ధైర్యం ఎవరికీ ఉంటుంది .

తనకిష్టమైన వ్యక్తుల గురించిన అక్షరాలను కూడా రాసుకున్నారు అందులో ప్రసిద్ధి చెందిన మైఖేల్ జాక్సన్ ని గుర్తుతెచ్చుకుంటూ "నీ పాటల్లో మనుసులు కలిసి పోవటం చూసాను//నీ పాటల్లో కరిగిపోవడం చూసాను/నాలో నువ్వు వున్నావు//నీకు తెలిసిన నీలో నాతో సహా ఈ ప్రపంచమే ఉంది " అని అతని కల ని తనది చేసుకుంటారు, 
ఎన్కౌంటర్ అయిన వివేక్ గురించి బాధపడుతూ "వీరుడా, నువ్వు తొందర పడి  ముందే కూసిన  కోయిల అయ్యావు, పోద్దేక్కకుండానే మట్టి లో కింద పడి మండిపోయిన నెలవంక అయ్యావు (మట్టి లో పడి మండిపోయిన నెలవంక )...ఇక దేశ భక్తి, దేశం పై ప్రేమ తో పురుషుడు చేసే త్యాగం వెనుక స్త్రీ మూర్తి హృదయాన్ని, తను పడుతున్న తపనని, వేదనని ఆర్థ్రత ఉట్టిపడేలా చెప్పారు ..ఈ కవిత చదివినప్పుడు మనకు తెలియకుండా నే కన్నీళ్ళు రాలిపోతాయి అనడం లో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. 

"ప్రజల కోసం పోరు బాట పట్టిన  ఓ వీరుడా/
నాకు మీరేంటి
 మీకు నేనేంటి
 పోరు ముగిసాక మనమేంటి/
ముగిసిన పోరు తరువాత రాజ్యానికి మనమెవ్వరం   
దిష్టి బొమ్మలు గా కూడా పనికి రాము ..ప్రియమైన మీరు ఈ రాజ్యానికి నేను ఎవరు (ఏమండీ ప్రియమైన నీకు) " కరుడు గట్టిన కఠిన శిల లను సైతం కదిలించ గలిగిన కవిత్వం కదు ..రాజకీయ నాయకుల కుటిల యత్నాల గురించి ప్రజలు ఎలా మోసానికి గురికాబడుతున్నారో చెప్పటానికి "ఎన్నాళ్ళు ఇలా " లో కడిగిపడెసారు .
యుద్ధ భూమి లో కి దిగడు //కాని యుద్ధాన్ని నిర్దేశిస్తాడు, జనం మద్య లోకి రాడు, కాని జనాన్ని నిర్వచిస్తాడు
అయిదేళ్ళ వరకు మనుషులంతా   పాకుడు పట్టిన నీటి లో అమీబాల్ల్లా తిరుగుతూనే ఉంటారు // రాజకీయ నాయకులకు ప్రజల పట్ల వున్నది కపట ప్రేమ ని కుండ బద్దలు కొట్టి చెప్పేస్తారు (ఎన్నాళ్ళిల ). 
 ఇక "ఓ అమ్మాయి అమీలియా " లో స్త్రీ జీవిత పరిణామా క్రమాన్ని, ప్రపంచం లో నేటి యువతీ ఉనికి ని కాపాడుకోమంటూ హెచ్చరిస్తూ మగవాడి నీచత్వాన్ని తలుచుకొని ఆవేదన చెందుతారు "ఆడపిల్ల గా ఒక్కొక్క ఏడు//యుక్తవయసు నీకు పెరుగుతూ వుంటే/అమ్మ తన కొంగు ఓ కార్చిచ్చు ఉన్నట్టు //ఆడదాని జీవితం ఎప్పుడు రిస్కే/ఆడదాని  జీవితం ఎప్పుడు ఆక్సిడెంట్ //కరిచే వరకు తెలియదు మగవాడు పాము అని // ఇలాంటి పంక్తులు మనల్ని కట్టి పడేస్తాయి. "బయటకు అడుగు పెడుతున్నావు అంటే ఆత్మ గౌరవాన్ని  కన్న కలలని చెప్పుల తో తీసుకు వేడుతున్నట్టే // అని స్త్రీ పట్ట పగలు  తిరగలేని స్థితి ని తలచుకొని వాపోతారు .

//జీవితం లో నేను రాసిన ఆఖరి సంతకం నువ్వే అయినప్పుడు , జీవితం లో నీ స్థానం  ఏమిటో , నా స్థానం ఏంటో నేను పోయాక అర్థం కాదు, (ఒరేయ్ కొడుకా , నువ్వు ఇలా అయిపోయావు  ఏంటి )// అని తండ్రి పడే వేదన ని అర్థం చేసుకోవచ్చు. ఇదే  కవితలో "రేపటి కలల ప్రపంచం వాకిట/నువ్వు గర్వపడే //సమర గీతం గా కలకాలం నిలవాలని వుంది రా అంటూ ఆశ ని వ్యక్తం చేస్తారు  అలాగే తన దిశ ని, గమ్యాన్ని మార్చి వేసిన ఆప్త మిత్రులు   "స్నేహితులు వాళ్ళిద్దరు " లో వారితో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటారు  అమ్మ గొప్పతనం గురించి న కవిత "అమ్మ పాత చీరల బొంత"  చదివాక గోర్కి "అమ్మ" గుర్తుకు రాకపోదు ...

ఆత్మ వంచన చేసుకునే వాడికి ప్రపంచం తో పనిలేదు .ప్రబుత్వం తో పని లేదు హాయి గా బతికేయగలడు మనిషి అని "నాప్ కిన్ మనుషుల్లో " చదివినప్పుడు మానవ సంబందాలు అన్ని ఉత్తి వేనా అనిపించక మానదు.  ఈ దేశం తనని తానూ ప్రతి  నిత్యం అవమానపర్చుకుంటూ ఉంటుంది .  .ఎన్నుకోబడిన నాయకుల చేత రాజ్యాంగాన్నిచీపురు కట్ట గా చేసి , ప్రజా హక్కులని ఊడ్చెస్తారు నాయకుల చే మోసబడింది ప్రజలే కాదు దేశం కూడా అందుకే దేశం అవమానించబడటం కొత్తేమి కాదంటారు (నేను నిన్ను క్షమించను) కవితలో.  ఇక నాకు నువ్వు, నీకు నేను లో నువ్వు దుఖం   తో సంద్రం  గా మారిన నువ్వు ఈ దేశపు  స్వతంత్రానివి, విరహం  కోసమే పుట్టిన జాతి మనది అని ప్రేమ ని గుమ్మరిస్తారు .. 

ప్రజల జీవితాలన్నీ యుద్ధమయమైన సమయమైన, ప్రజల జీవితాలు రెండు అస్తమయాల  మధ్య మండిపోతున్న మానవ గోళాలు అవుతున్నప్పుడు తనలో తానూ, తన తో తానూ ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూ, వ్యవస్థ మార్పు కోసం, ప్రజల బాగు కోసం తపన పడే అక్షరాలను "మంత్ర లిపి" లో అందించారు.  
మొత్తం 54  కవితలు ఉన్న పుస్తకం లో "నువ్వు కన్న స్వప్నం", "ఒరేయ్ కొడుకా ", అవును మేమంతా ఒక్కటే మేమంతా  ఒకటే ", "మూడో పాదం" , "రక్తం లో  తడిసిన అక్షరం " "వాంటెడ్ " లాంటి మంచి కవితలు వున్నాయి .. భావుకత ని, వైరాగ్యాన్ని, వైయుక్తికాన్ని, వ్యవస్థ ని మార్చాలన్న కసి ని ఈ అక్షరాల్లో చూడొచ్చు ..
కొనకంచి గారు అద్భుతమైన కవిత్వాన్నే కాక మంచి నవలా  రచనల్ని కూడా లోగడ రాసి వుండటం విశేషం. ప్రజలను, వారి భాధలను అక్షరీకరించే కవులు కొంత మంది మాత్రమె వుంటారు ..ఆ కోవ లో కి కొనకంచి గారు ముందు ఉంటారు . 
మంత్ర లిపి  ప్రజల తల రాతలను కొద్ది గా అయినా మార్చ గలిగితే, మరిన్ని పుస్తకాలను వారి నుంచి ఆశించవచ్చును .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి