4, ఫిబ్రవరి 2016, గురువారంఇలాంటి శత్రువులున్నవాడు నిజంగా అద్రుస్టవంతుడు
.....................................................................
ఓ.. ఎందుకూ పనికిరాని ..ఎలాంటి ఉపయొగమూలేని ..అనుచరుడికంటే ..స్నేహితుడికంటే 
అనుక్షణం..నన్ను ఇన్స్ పైర్..చెసే..నన్ను అనుక్షణం..అలర్ట్ గా ఉంచి.. అనుక్షణం..నాలో పొటీ తత్వం పెంచెలా ..పరుగెత్తించే ..నా శత్రువు అంటేనే నాకిస్టం
ఇలాంటి శత్రువులు లేనివాడు ..ఏ రంగంలో అయినా ..త్వరగా చచ్చిపోతాడు
చచ్చే వరకూ ..ఇలాంటి శత్రువులున్నవాడు నిజంగా అద్రుస్టవంతుడు

ఇలాంటివాళ్ళు చచ్చిపొఇనా కూడా ..ఎదొ ఒకరకంగా బ్రతికుంటారు

27, జనవరి 2016, బుధవారం

సాహిత్యం


ఈ మతం ఈ దేశంలోనే సర్వనాశనమవుతుంది.
.............................................................

ప్రస్తుతం భారతదేశంలో హిందూ మతం..మతం.....హిందూమత వ్యతిరేకత ..అనే రెండు భావజాలాలతొ కొట్టు మిట్టాదుతున్నది
నిజానికి హిందూమతంలో ఉన్న ఒక..బ్రాహ్మణ వర్గం భొగలాసత..సుఖ జీవనం..మనుషులని వర్గాలు గా విభజించి తాము
ఇన్నాళ్ళు అదే తమ నాగరికత అని చెప్పుకుంటూ బ్రతికింది.తాము భ్రమించిన అవాస్తవాలని ..వాస్తవాలుగా మతంలో ప్రచారం చేస్తూ లబ్ది పొందింది.
ఇప్పుడు అదే శాపంగా 
ఇతరమతాల దాడిలో 
భారతీయత ..హిందూ మతం నాశనమయ్యే స్థితికి దిగజారింది.
ఈ ప్రమాద ఘంటికలని ఇంకెవ్వరూ గురించలేదు.
అసలు ఈ మతం నాశనం అవటానికి..కాషాయం కట్టి మతోద్ధారణ పేరుతో హిందువుల బలహీనతల మీద హిందూ మత నాశననికి పని చేస్తున్న ప్రతి ఒక్క కాషాయపు గురువులకు చెందుతుంది.
నిజానికి వీళ్ళంతా చేస్తున్నది అన్యమతాలవాళ్ళు చేస్తున్న దానిలాగే హిందూ మత వినాశనం.

కారణం వీళ్ళకి హిందూ మతం అనేది వీళ్ళు సుఖంగా బ్రతకటానికి పనికి వచ్చే ..ఆర్ధిక వనరు.
అంతే .
వీళ్ళకి జనం తో పని లేదు.
ప్రజలతో పని లేదు.జనం ఇచ్చే చందాలు..డబ్బు..హిందువులని..యజ్ఞాలపేరుతో యాగాల పేరుతో..అమ్మేస్తూ తాము సుఖంగా బ్రతకటానికి అలవాటు పడిన ..ఈ కాషాయపు నేరగాళ్ళ వల్లే భారత దేశం భవిష్యత్తులో మట్టిగొట్టుకు పోతుంది.
ఈ పీఠాధిపతులు ఇప్పటి వరకూఎవ్వరూ నేను సమాజం లో.. భాగాన్ని.అని సమాజం లో ఉన్న లుక లుకలను మార్చటానికి గానీ ..అన్యమతాల ధాడిని ఎదుకోవటానికి హిందూ మతస్థులను తయారు చేయటానికి గాని ఏ రో జూ సిద్ధపడలేదు. 
నిజంగా ఇప్పుడున్న పీఠాధిపతులు..హిందూ మఠాధిపతులంతా ..అన్య మతాల దాడిలో ..జరుగుతున్న దాడులను గుర్తించని కాషాయపు గుడ్డివాళ్ళు..
నిజానికి వ్యవస్థలో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు..ముందుగా ఎలుగెత్తి మతం తరపున మాట్లాడని..ఈ వెధవలు నా ద్రుష్తిలో జాతి ద్రోహులకుందే లెక్ఖ.
ఆవుల కాల్లకి దండాలు పెట్టుకుంటూ ..పాదపూజలు చేయించుకుంటూ..ఎస్ సీ ..బీ సీ ..మిగిలిన చాలా కులా ల కుల వ్యవస్థని నిర్మూలించుకోని ..మనమంతా ఒక్కటే అనే జాతీయభావన్ని ..హీందువుల్లో తీసుకు రాకుండా ..దళిత వాడల్లో ఉన్న మనుషుల్లో హిందూ మత చయితన్యాన్ని తీసుకు రాకుండా 
ఈ కాషాయపు దుర్మార్గులు చేస్తున్న దుర్మార్గం చలా ప్రమాదకరమయినది.
ఇవ్వాళ్ళ హిందూమతోద్ధారణ అనేది..దలిత వాదలనించే జరగాలి..దళితులు అన్నపదాన్ని సమాజంలోంచి తీసివేయాలి.
వెలివాడల్లోంచి..హిందూ మతం తనను తాను ఆధునికరించుకోక కపోతే ..భవిష్యత్తులో..హిందూమతం సర్వనాశనమవుతుంది.
ఈ మత ఆధునీకరణకు ..మతాన్ని నమ్మి బ్రతికే ప్రతి బ్రాహ్మణుడు..ప్రతి మఠాధిపతి నడుం కట్టకపోతే ..భవిషయత్తులో..ఈ మతం ఈ దేశంలోనే సర్వనాశనమవుతుంది.
దీన్ని ఎవ్వరూ ఆపలేరు.
మనుషులని డబ్బుగా..గుర్తిస్తూ మనుషులని మనుషులుగా గుర్తించని ఏ మతమయినా మట్టికొట్టుకు పోతుంది..భవిష్యత్తులో .
దీనికి హిందూ మతం ఏమీ ఎక్జెంప్షన్ కాదు

సాహిత్యం

రాళ్ళేసే మీ అజ్ఞానాన్ని చూసి జాలిపడుతున్నను
...............................................


పాముకాటును మీరేప్పుడన్నా చూసారా ..చాలా అందంగా ఉంటుంది.స్టయిలిష్ గా ఉంటుంది.రెందు కోరలు పక్క పక్కనే ..దిగి కొంత రక్త బయటికొచి..చాలా క్రియేటివ్ గా ఉంటుంది.
విషాన్ని కక్కటానికి కూడా విషయం ఉండాలి.సిన్సియరిటీ కూడ ఉండాలి.
ఎవరిని కాటు వేస్తున్నామో ఎందుకు కాటు వేస్తున్నామో కూడా తెలియనఖ్ఖరలేదు.
కాటువేయబడ్డవాడు బ్రతికాడా చఛ్ఛాడా అన్నది కూడా అవసరం లేదు.
ముందు కాటువెయటం నేర్చుకోవాలి ..
లేకపోతే కాటు వేయటం అనేది ..వాంతి చెసుకున్నట్టు అస హ్యంగా ఉంటుంది .
కాటువేయటం రాని అసమర్ధులకు..కాటు ఎలా వేయాలో ..చెప్పే ..అవతలి మనుషుల..అజ్ఞానాన్ని..
చూసి అసహ్యం వేఅతుంది .
కన్స్త్రక్టివ్ ఆటిట్యూడ్ లేకుండా..హిందూ మతం మీద విషం కక్కటం.. అనేది ...నోటితో మల విసర్జన చేయటం తప్ప మరేమీకాదు 
మీ లాంటి అల్పజ్ఞులు మతం మారినా కూడా ..మారిన మతంలో ఉన్న గొప్పతనాన్ని ..ప్రేమించటం అనే కాన్సెప్ట్ అర్ధం చేసుకోకుండా...
ఆ మతం చాటున ..హిందూమతం మీద రాళ్ళేసే మీ అజ్ఞానాన్ని చూసి జాలిపడుతున్నను.
మతం పేరుతో..నేను మిమ్మల్ని అసహ్యించుకున్నా ..మీరు నన్ను అసహ్యించుకోని రాళ్ళేసుకున్నా ..
అది చివరికి భారత జాతి విచ్చిత్తికి దారి తీస్తుంది .
దొడ్డి దారిన మనరెండు మతాలని తొక్కేసుకుంటూ మొగలాయీల పాలన వస్తుంది.
నువ్వూ నేను జిజియా పన్ను కట్టల్సి ఉంటుంది.
మన ఆడంగులు ...చిత్తోడ్ ఘడ్ రాజపుత్రికల్లా చితులు పేర్చుకోని అగ్ని ప్రవేశం ..
చేయాల్సివస్తుంది.
ఇప్పటికయినా కాస్త మేలుకోని చరిత్రని చూసి .రేపటి చరిత్రను..కొద్దిగా అయినా మార్చండి .
లేకపొతే చరిత్రలో మీరెవ్వరూ ..మీ వారసులెవ్వరూ ..మిగలరుగాక మిగలరు

అవీ..ఇవీ


Probably this is the last post. I am a man of 70, and I have very few years more to live. I tried to pass on my knowledge I acquired in my life to you, so that you may benefit. This knowledge I acquired from my gurus, before whom I stood with folded hands for decades before they gave me that knowledge.
But what did I get in return? I got mostly abuses from most you, because most of you are stupid and arrogant, and have no desire to learn. I am sorry I even tried to teach you. So, goodbye.

Markandey Katju

19, జనవరి 2016, మంగళవారం

కవిత్వం

మా..ఆ ఊరు..పల్లెటూరు 

.......................................


ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఎమాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు ..వూరి ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
అది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆపల్లెటూరిలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆవూర్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.
మోదుగాకు విస్తరాకుల్లో బదులు
బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు.
వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు
ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు.
షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలనే పేరుతో
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి మొక్కలు చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రెల పాలని ..
డయిరీ ఫారంల కు పోసి..
మనుషులంతా బలం కోసం
రోజుకో బీ కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..
ఖాతాలుపెట్టి క్వార్టర్లు తాగుతుంటే
తెల్ల కార్డు వాళ్ళ ఆరోగ్యాలకి
జవాబుదారీగా మారిపోయింది.
2        

సాహిత్యం

ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది

న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.
న్యాయం ఎప్పుడూ..అన్యాయంతో యుద్ధంచేస్తుంది .న్యాయం..ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది.స్వశక్తితో మాత్రమే పోరాడుతుంది.
కాని అన్యాయానికి..పొరాడటానికి వంద చేతులు ..వంద ఆయుధాలు..వేలమంది..అభిమానులు...అనుచరులు...అన్యాయానికి ఒల్లంతా ..కళ్ళే ..ప్రతి కన్నుతో..ఏ మనిషికి ..ఆ మనిషికి విడి.విడిగా మనిషికో కమర్షియల్ సినిమా చూపిస్తుంది.నిమిషానికో సారి..నిమిషానికో రూపం తో వేశ్యగా మారి ..మనుషులని మాయ చేయాలని చూస్తుంది .
మనుషులని..మత్తులో ముంచేసేందుకు..మదిర..అవుతుంది..ఆడదవుతుంది.డబ్బు అవుతుంది..సుఖం అవుతుంది .సవుఖ్యమవుతుంది ..
ఇలా...ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు ..
నిజంకూడా అంతే...అబద్ధంతో .అన్నికాలాల్లోనూ పొరాడుతూనే ఉంటుంది.నిజం..ఒక్క మాట మాట్లాడితే..అబద్ధం ..వెయ్యి మాటలు మాట్లాడుతుంది.అబద్ధానికి వెయ్యి గొంతులు..అబద్ధానికి..వొళ్ళంతా అత్తరు వాసనే..మనిషి మనిషికీ..ఆయా మనుషులకు..ఇస్టమైన ..సుగంధాన్ని పంచుతూ..రంగూ రుచి వాసన మార్చుకుంటూ...అలా..పెరిగి పోతూనే ఉంటుంది .
అబద్ధం చేతిలో పత్రిక లుంటాయి .పబ్లిక్ రిలేషన్ శక్తులుంటాయి ..స్వార్ధంతో పనిచేసే ..మనుషులుంటారు ...నిద్రబొతే..తనను ఎవరైనా చంపేస్తారేమో అన్న ..భ్రాంతితో..అబద్ధం ఎప్పుడూ నిద్ర బోదు.అదిగాలిలో గాలి అయ్యి..అలా..ఏదో ఒక రూపంలో..ప్రయాణిస్తూనే ఉంటుంది...
ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది ..
న్యాయం ..నిజం..ధర్మం..ఈ మూడింటినీ నమ్ముకున్న మనిషి అందుకే ఎప్పుడూ సుఖంగా ఉండలేడు .చచ్చేవరకూ యుద్ధ చేస్తూనే ఉండాలి
ఈ మూడింటినీ..ఆచరించని మనుషులు అందుకే డబ్బుతోనూ ..వేశ్యలతోనూ..మందుతోనూ .మత్తులతో సుఖిస్తూ ఉంటారు.
ఈ మూడింటినీ ఆచరించే మనుషులు యుద్ధం చేస్తుంటారు ..కాని చరిత్రొలొ నిలిచేది..తరాలుగడిచినా చెప్పుకునేది ..ఈ పొరాట యోధుల గురించే .
అందుకే ..న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.