19, జనవరి 2016, మంగళవారం

కవిత్వం

మా..ఆ ఊరు..పల్లెటూరు 

.......................................


ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఎమాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు ..వూరి ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
అది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆపల్లెటూరిలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆవూర్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.
మోదుగాకు విస్తరాకుల్లో బదులు
బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు.
వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు
ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు.
షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలనే పేరుతో
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి మొక్కలు చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రెల పాలని ..
డయిరీ ఫారంల కు పోసి..
మనుషులంతా బలం కోసం
రోజుకో బీ కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..
ఖాతాలుపెట్టి క్వార్టర్లు తాగుతుంటే
తెల్ల కార్డు వాళ్ళ ఆరోగ్యాలకి
జవాబుదారీగా మారిపోయింది.
2



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి