27, జనవరి 2016, బుధవారం

సాహిత్యం

రాళ్ళేసే మీ అజ్ఞానాన్ని చూసి జాలిపడుతున్నను
...............................................


పాముకాటును మీరేప్పుడన్నా చూసారా ..చాలా అందంగా ఉంటుంది.స్టయిలిష్ గా ఉంటుంది.రెందు కోరలు పక్క పక్కనే ..దిగి కొంత రక్త బయటికొచి..చాలా క్రియేటివ్ గా ఉంటుంది.
విషాన్ని కక్కటానికి కూడా విషయం ఉండాలి.సిన్సియరిటీ కూడ ఉండాలి.
ఎవరిని కాటు వేస్తున్నామో ఎందుకు కాటు వేస్తున్నామో కూడా తెలియనఖ్ఖరలేదు.
కాటువేయబడ్డవాడు బ్రతికాడా చఛ్ఛాడా అన్నది కూడా అవసరం లేదు.
ముందు కాటువెయటం నేర్చుకోవాలి ..
లేకపోతే కాటు వేయటం అనేది ..వాంతి చెసుకున్నట్టు అస హ్యంగా ఉంటుంది .
కాటువేయటం రాని అసమర్ధులకు..కాటు ఎలా వేయాలో ..చెప్పే ..అవతలి మనుషుల..అజ్ఞానాన్ని..
చూసి అసహ్యం వేఅతుంది .
కన్స్త్రక్టివ్ ఆటిట్యూడ్ లేకుండా..హిందూ మతం మీద విషం కక్కటం.. అనేది ...నోటితో మల విసర్జన చేయటం తప్ప మరేమీకాదు 
మీ లాంటి అల్పజ్ఞులు మతం మారినా కూడా ..మారిన మతంలో ఉన్న గొప్పతనాన్ని ..ప్రేమించటం అనే కాన్సెప్ట్ అర్ధం చేసుకోకుండా...
ఆ మతం చాటున ..హిందూమతం మీద రాళ్ళేసే మీ అజ్ఞానాన్ని చూసి జాలిపడుతున్నను.
మతం పేరుతో..నేను మిమ్మల్ని అసహ్యించుకున్నా ..మీరు నన్ను అసహ్యించుకోని రాళ్ళేసుకున్నా ..
అది చివరికి భారత జాతి విచ్చిత్తికి దారి తీస్తుంది .
దొడ్డి దారిన మనరెండు మతాలని తొక్కేసుకుంటూ మొగలాయీల పాలన వస్తుంది.
నువ్వూ నేను జిజియా పన్ను కట్టల్సి ఉంటుంది.
మన ఆడంగులు ...చిత్తోడ్ ఘడ్ రాజపుత్రికల్లా చితులు పేర్చుకోని అగ్ని ప్రవేశం ..
చేయాల్సివస్తుంది.
ఇప్పటికయినా కాస్త మేలుకోని చరిత్రని చూసి .రేపటి చరిత్రను..కొద్దిగా అయినా మార్చండి .
లేకపొతే చరిత్రలో మీరెవ్వరూ ..మీ వారసులెవ్వరూ ..మిగలరుగాక మిగలరు

అవీ..ఇవీ


Probably this is the last post. I am a man of 70, and I have very few years more to live. I tried to pass on my knowledge I acquired in my life to you, so that you may benefit. This knowledge I acquired from my gurus, before whom I stood with folded hands for decades before they gave me that knowledge.
But what did I get in return? I got mostly abuses from most you, because most of you are stupid and arrogant, and have no desire to learn. I am sorry I even tried to teach you. So, goodbye.

Markandey Katju

19, జనవరి 2016, మంగళవారం

కవిత్వం

మా..ఆ ఊరు..పల్లెటూరు 

.......................................


ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఎమాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు ..వూరి ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
అది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆపల్లెటూరిలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆవూర్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.
మోదుగాకు విస్తరాకుల్లో బదులు
బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు.
వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు
ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు.
షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలనే పేరుతో
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి మొక్కలు చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రెల పాలని ..
డయిరీ ఫారంల కు పోసి..
మనుషులంతా బలం కోసం
రోజుకో బీ కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..
ఖాతాలుపెట్టి క్వార్టర్లు తాగుతుంటే
తెల్ల కార్డు వాళ్ళ ఆరోగ్యాలకి
జవాబుదారీగా మారిపోయింది.
2



        

సాహిత్యం

ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది

న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.
న్యాయం ఎప్పుడూ..అన్యాయంతో యుద్ధంచేస్తుంది .న్యాయం..ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది.స్వశక్తితో మాత్రమే పోరాడుతుంది.
కాని అన్యాయానికి..పొరాడటానికి వంద చేతులు ..వంద ఆయుధాలు..వేలమంది..అభిమానులు...అనుచరులు...అన్యాయానికి ఒల్లంతా ..కళ్ళే ..ప్రతి కన్నుతో..ఏ మనిషికి ..ఆ మనిషికి విడి.విడిగా మనిషికో కమర్షియల్ సినిమా చూపిస్తుంది.నిమిషానికో సారి..నిమిషానికో రూపం తో వేశ్యగా మారి ..మనుషులని మాయ చేయాలని చూస్తుంది .
మనుషులని..మత్తులో ముంచేసేందుకు..మదిర..అవుతుంది..ఆడదవుతుంది.డబ్బు అవుతుంది..సుఖం అవుతుంది .సవుఖ్యమవుతుంది ..
ఇలా...ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు ..
నిజంకూడా అంతే...అబద్ధంతో .అన్నికాలాల్లోనూ పొరాడుతూనే ఉంటుంది.నిజం..ఒక్క మాట మాట్లాడితే..అబద్ధం ..వెయ్యి మాటలు మాట్లాడుతుంది.అబద్ధానికి వెయ్యి గొంతులు..అబద్ధానికి..వొళ్ళంతా అత్తరు వాసనే..మనిషి మనిషికీ..ఆయా మనుషులకు..ఇస్టమైన ..సుగంధాన్ని పంచుతూ..రంగూ రుచి వాసన మార్చుకుంటూ...అలా..పెరిగి పోతూనే ఉంటుంది .
అబద్ధం చేతిలో పత్రిక లుంటాయి .పబ్లిక్ రిలేషన్ శక్తులుంటాయి ..స్వార్ధంతో పనిచేసే ..మనుషులుంటారు ...నిద్రబొతే..తనను ఎవరైనా చంపేస్తారేమో అన్న ..భ్రాంతితో..అబద్ధం ఎప్పుడూ నిద్ర బోదు.అదిగాలిలో గాలి అయ్యి..అలా..ఏదో ఒక రూపంలో..ప్రయాణిస్తూనే ఉంటుంది...
ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది ..
న్యాయం ..నిజం..ధర్మం..ఈ మూడింటినీ నమ్ముకున్న మనిషి అందుకే ఎప్పుడూ సుఖంగా ఉండలేడు .చచ్చేవరకూ యుద్ధ చేస్తూనే ఉండాలి
ఈ మూడింటినీ..ఆచరించని మనుషులు అందుకే డబ్బుతోనూ ..వేశ్యలతోనూ..మందుతోనూ .మత్తులతో సుఖిస్తూ ఉంటారు.
ఈ మూడింటినీ ఆచరించే మనుషులు యుద్ధం చేస్తుంటారు ..కాని చరిత్రొలొ నిలిచేది..తరాలుగడిచినా చెప్పుకునేది ..ఈ పొరాట యోధుల గురించే .
అందుకే ..న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.

18, జనవరి 2016, సోమవారం

సాహిత్యం

నేను....
.........................

నా కవిత్వం ఎక్కువమందికి నచ్చటానికి కారణం..నా కవిత్వం లో ఉన్న ప్యూరిటీ.
నా వ్యక్తిగతంగా నాలో ఉన్న ప్యూరిటీనే..నా కవిత్వంలో ఉంటుంది.
నేను వ్యక్తులతో రాజకీయాలు చెయ్యలేను .వ్యక్తులతో ఆడుకో లేను.వ్యక్తుల జీవితాల్లో నవ్వుతూనే..నిప్పులు పోయలేను.
అలా నవ్వుతూ..నా జీవితంలో నిప్పులు పోసిన వాళ్ళని చాలామందిని జర్నలిజం లో చూశాను.సినిమా రంగంలో చూశాను.
నేను నిప్పుల్లో పడ్డ ప్రతిసారీ..స్వచ్చంగా బయటికి రావటానికి నన్ను నేనే తీర్చిదిద్దుకున్నాను..
నేను వెరే వాళ్ళతో ఆపని చెయ్యకుండా ఉండటంకోసం అంతులేని పొరాటాలు చేసాను.
వ్యక్తిగా చచ్చిపొయినా కవిగా.. రచయితగా గెలిచాను.
కారణం ..చెప్పాను కదా నాలో ఉన్న స్వచ్చతే.
నా కవిత్వంలో ఉన్న మరో అంశ ఇన్నోసెన్స్.
గొప్పరచయిత కావాలంటే ..ఎంతో కొంత ఇన్నోసెన్స్ కూడా అవసరం.గొప్ప రచనలను..చదివినప్పుడు..గొప్ప మనుషులని కలిసినప్పుడు నేను రచయితని అన్న స్ప్రుహ లేకుండా కొత్తగా నేనేం తెలుసుకంటానా అని ఆరాట పడటమే ఇన్నోసెన్స్.నేర్చుకోవటానికి ఎక్కడేం దొరుకుంతుందా అని తపించటమే ఇన్నోసెన్స్.
మూడో అంశ ..వాస్తవాన్ని వాస్తవం గా గుర్తించటం.వాస్తవాన్ని వాస్తం గా అంగీకరించటం.
నాచుట్టూ ఉన్న క్రియేటర్స్ కోల్పొయిన చొటే నేను మొదయ్యాను.మొదలవుతాను.అదే నా కవిత్వం ..రచన ..మరేదయినా
చాలామంది తమ స్రుజనాత్మకతను మొత్తాన్ని ఏదో ఒక పార్టీకి తాకట్టు పెట్టి..తమ అస్థిత్వాన్ని మొత్తం కోల్పొవటం నాకు తెలుసు.
చివరకి వాళ్ళు ఆ  యా పార్టీల జెండాలుగా మారిపొయి ..చివరకు భజన పరులుగా మిగిలి పోవటం నేను చూశాను.
కవిగా..నేను హీరొని ..హీరోలా ఉండాలనుకుంటాను.
నేను విదూషకుడిలాగానో..విలన్ ..లాగానో కాదు.
కారణం నా ముందు వచ్చేతరం ..నన్ను హీరో లా చూడాలన్న..కోరిక
అందుకే నేను ఏపార్టీకి నేను కట్టుబడి నా కవి స్వేచ్చని కొల్పోలేక పోవటమే.
చాలామంది రచయితలు తాము చెప్పేది ఒకటి ఆచరించేది మరొకటి వయిరుధ్యాల్లో బ్రతుకుతుంటారు.
ఈ వయిరుధ్యాలు జీవితం మీదే కాక రాసే పదార్ధం మీద కూడా పడటం వల్ల చాలామంది అకవులు గా కుకవులు గా మిగిలి పోతారు.

{ఇంకా ఉంది}
   
     

17, జనవరి 2016, ఆదివారం

సాహిత్యం

మీకు..తెలుసా..మీరొకఫ్ఫుడు ..బ్రతికుండే వారు..
.............................................................

మాకు ..పూవులు..ముళ్ళు ..ఒక్కటే..
మాకు..ముళ్ళల్లో కూడా పూవులు కనిపిస్తాయి.
మనుషుల్ని ద్వేషించటమే..పనిగా పెట్టుకున్నవాళ్ళకు మాత్రమే ..పూలు కూడా ముళ్ళు గా కనిపిస్తాయి..
మాకు మాత్రం కాదు .....
బ్రతకటం మాకు వ్యాపారం కాదు .సంపాదన మమ్మల్ని ఆవహించిన ..పిచ్చి దెయ్యం కాదు..
సంపాయించటానికి ..అమానవీయంగా బ్రతకటం ....అందరి ముందూ తల వంచి నిలబడి..వ్యవస్థలో..పిచ్చెక్కిన కుక్కలా నిలబడి..అందరిచేత రాళ్ళ తో కొట్టబడుతూ సంపాయిచటం..ఏవరికోసం?ఎవరి ఆనందాలకోసం........
డబ్బు సంపాదన అంటే ..ఆత్మ వంచనేనా?ఆత్మ వంచన చేసుకోని సంపాయించిన డబ్బు మీకు సంతోషాన్నిస్తుందా?..
అవసరమైన దాన్ని ఒదులుకోని..అనవసరమైన దాని వెంట పరుగెడు తున్న ..మీ చుట్టూ ఉన్న మానవ సమూహాలను చూడండి ..జాలి వేయటంలేదూ..వాళ్లని చూస్తూంటే....
రేపటి చరిత్రల్లో నేటి దవుర్భాగ్య...మానవులైన వీళ్ళు ..చరిత్రలన్నీ..స్మశానంలో వీళ్ళ తో పాటే ..వీళ్ళ బూడిదతో పాటే అంతమవుతాయి.........
రాబందులన్నీ ..ఇప్పుడు..మానవ రూపంలో ..ఊరేగుతున్నాయి.....ప్రేమించాలసిన పక్కవాళ్ళ నొదిలేసి..ప్రేమించాల్సిన మనుషులని ఒదిలేసి ...డబ్బుకట్టలని ..పోగేసుకుంటూ ..తమ ఇళ్ళనే స్మశానాలని చేసుకుంటున్నాయి..తమ శరీరాలనే ..ఆసుపత్రులుగా ..మురగ బెట్టుకుంటున్నాయి .
...డబ్బుకోసం మనుషులు బరితెగించి..బ్రతుకుని పారేసుకుంటూ ..తమ మనసుల్ని..చెత్త బుట్టలని చేసేసుకుంటున్నారు .
.
నాగరిక త పేరుతో ..టెక్నాలజీ పేరు తో ..సంపాదన పేరుతొ ..డభ్భు..కోసం..మనుషులు..తమకు తెలియకుండానే ..చనిపొయి..బ్రతుకుతున్నారు..
అసలు వాస్తవాలని గుర్తించకుండా..బ్రతకటాన్నీ..బ్రతుకుని..కూడా ఊహించుకుంటూ బ్రతుకు తున్నారు...
మీకు..తెలుసా..మీరొకఫ్ఫుడు ..బ్రతికుండే వారు..మీకు తెలుసా..మీ రొకప్పుడు ..మనుషులుగా ..ఉండే వారు..
ఈ విషయాన్ని ఎవరైనా ..వాళ్ళకు చెప్పండి

సాహిత్యం


ఏది సత్యం?ఏది అసత్యం?
.....................................



మనకు ఇష్టమైతే..కంటికి కనిపించే అసత్యం కూడా సత్యమవుతుంది..
మనకు అయిష్టమైతే ..కంటికి కనిపించే ..సత్యం కూడా అసత్యమవుతుంది

16, జనవరి 2016, శనివారం

సమీక్షలు

"ప్రజల పక్షాన నిలబడే మంత్ర లిపి 
.....................................................

 ప్రజల కోసం పుట్టే రచన ఎప్పుడు అజరామరమే, సాహిత్యం లో ఎన్ని వాదాలు వచ్చినా, ప్రజల పక్షం వహించి నిలబడేవి కొన్ని మాత్రమె, అవే పది కాలాల పాటు మిగులుతాయి.
 ఆలాంటి కోవ లో కి చెందిన పుస్తకమే కొనకంచి లక్ష్మి నరసింహ రావు గారు రాసిన  "మంత్ర లిపి ". 
 ఈ అక్షర లిపి కి చైతన్య పరిచే గుణం ఉన్నది.  మంత్రలిపి అక్షరాలను  ని చేతుల్లోకి  తీసుకొని చూసినప్పుడు చీకటి చీల్చే వెలుగు కిరణం లా అగుపడింది  .."బతకటం కోసం పరిగెత్తి తమంతట తామే చావు కౌగిట్లో చేరి తెల్లారిపోతారు(మంత్రం లిపి)" అన్నప్పుడు మనిషి జీవితం ఎంత సంక్లిష్టం. ఇదే కవితలో ఈ దేశ స్థితి ని ఎండగడుతూ ఇలా,
 "అమ్మక ద్రోహం మా ఇంటి పేరు , 
లంచం మా జన్మ హక్కు, 
అవీనితి మా జాతీయ సంపద// 
దేశం అంటే ఉట్టీ మట్టి//
మనిషి అంటే పిడికెడు నల్ల బూడిద " 
అని  ఈ దేశం లో పాతుకుపోయిన అవినీతి ని ఎండగడతారు .. 
చావు బతుకుల మద్య చిన్న విరామ చిహ్నమే జీవితం అన్నప్పుడు, నిజమైన స్వేచ్చ అంటే స్వేచ్చ లేకుండా బతకటమే అన్న విరక్తి ని వైయుక్తికాన్ని మేళవించి చెప్పడం లో ఎంత అనుబవం వుండాలి "అప్పుడు ఎప్పుడో ఒకసారి" లో నీ గుర్తు పద్యమై , గద్యమై కొత్త రహదారి గా మిగిలిపోతాను, గగనాన్ని ప్రశ్నిస్తూ కొండ శిఖరం లా మిగిలిపోతాను అని మనల్ని పునరాలోచన చెయ్యమంటారు.  

మనిషి అంటే ఎవరు, ఎవరైనా కావొచ్చు కాని ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతు మాత్రం ఈ దేశం లో ఓ అబద్దం గా మారడమే విషాదం.  
అవును ఇక్కడ "రైతు పండించే దాన్యం నిజం, రైతు మాత్రం అబద్దం", 
 నేను అన్నం తిందామనుకుంటున్న ప్రతి సారి నా కంచం లో ఏ కన్న తల్లి వో రెండు కన్నీటి బొట్లు జారిపడి మెరుస్తూ కనిపిస్తున్నాయి //
ఆత్మాహత్య చేసుకున్న రైతు బార్యవో/
రోదిస్తూ తెగిపడ్డ పుస్తెలు కనిపిస్తున్నాయి 
అని దేశం లో రైతు బతుకు బాధలను ..రాజ్యం రైతు పట్ల చూపిస్తున్న వివక్షత ను నిరసిస్తారు. 
 "పునరపి మరణం, పునరపి జననం " నిత్య సత్యం ఇది.మరణం అంచులలో మనిషి మానసిక స్థితి ఏంటి, మృత్యువు లేని చోట ఎక్కడ, బతుకున్నప్పుడు  చేసిన కర్మ ఫలాన్ని తలచుకుంటూ రోగగ్రస్తమైన జీవితాన్ని ప్రేమ తో దగ్గర కి తీసుకునే స్మశానం మే నీకు మారు తల్లి..నిజమే ...మనిషి మనుగడ జీవిక ఉన్నతవరకే ఆ తరువాత అంతా  శూన్యమే ..
"నిన్ను నవమాసాలు కడుపు న  మోసి పెంచిన కన్న తలి అమ్మ, నిన్ను ప్రేమతో తన కడుపు లో కి తీసుకున్న మారు తల్లి స్మశానం/ఇద్దరమ్మ ల మధ్య మనిషి ప్రయాణమే జీవితం(మరణానికి ముందు ఎవరైనా) " అనగల ధైర్యం ఎవరికీ ఉంటుంది .

తనకిష్టమైన వ్యక్తుల గురించిన అక్షరాలను కూడా రాసుకున్నారు అందులో ప్రసిద్ధి చెందిన మైఖేల్ జాక్సన్ ని గుర్తుతెచ్చుకుంటూ "నీ పాటల్లో మనుసులు కలిసి పోవటం చూసాను//నీ పాటల్లో కరిగిపోవడం చూసాను/నాలో నువ్వు వున్నావు//నీకు తెలిసిన నీలో నాతో సహా ఈ ప్రపంచమే ఉంది " అని అతని కల ని తనది చేసుకుంటారు, 
ఎన్కౌంటర్ అయిన వివేక్ గురించి బాధపడుతూ "వీరుడా, నువ్వు తొందర పడి  ముందే కూసిన  కోయిల అయ్యావు, పోద్దేక్కకుండానే మట్టి లో కింద పడి మండిపోయిన నెలవంక అయ్యావు (మట్టి లో పడి మండిపోయిన నెలవంక )...ఇక దేశ భక్తి, దేశం పై ప్రేమ తో పురుషుడు చేసే త్యాగం వెనుక స్త్రీ మూర్తి హృదయాన్ని, తను పడుతున్న తపనని, వేదనని ఆర్థ్రత ఉట్టిపడేలా చెప్పారు ..ఈ కవిత చదివినప్పుడు మనకు తెలియకుండా నే కన్నీళ్ళు రాలిపోతాయి అనడం లో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. 

"ప్రజల కోసం పోరు బాట పట్టిన  ఓ వీరుడా/
నాకు మీరేంటి
 మీకు నేనేంటి
 పోరు ముగిసాక మనమేంటి/
ముగిసిన పోరు తరువాత రాజ్యానికి మనమెవ్వరం   
దిష్టి బొమ్మలు గా కూడా పనికి రాము ..ప్రియమైన మీరు ఈ రాజ్యానికి నేను ఎవరు (ఏమండీ ప్రియమైన నీకు) " కరుడు గట్టిన కఠిన శిల లను సైతం కదిలించ గలిగిన కవిత్వం కదు ..రాజకీయ నాయకుల కుటిల యత్నాల గురించి ప్రజలు ఎలా మోసానికి గురికాబడుతున్నారో చెప్పటానికి "ఎన్నాళ్ళు ఇలా " లో కడిగిపడెసారు .
యుద్ధ భూమి లో కి దిగడు //కాని యుద్ధాన్ని నిర్దేశిస్తాడు, జనం మద్య లోకి రాడు, కాని జనాన్ని నిర్వచిస్తాడు
అయిదేళ్ళ వరకు మనుషులంతా   పాకుడు పట్టిన నీటి లో అమీబాల్ల్లా తిరుగుతూనే ఉంటారు // రాజకీయ నాయకులకు ప్రజల పట్ల వున్నది కపట ప్రేమ ని కుండ బద్దలు కొట్టి చెప్పేస్తారు (ఎన్నాళ్ళిల ). 
 ఇక "ఓ అమ్మాయి అమీలియా " లో స్త్రీ జీవిత పరిణామా క్రమాన్ని, ప్రపంచం లో నేటి యువతీ ఉనికి ని కాపాడుకోమంటూ హెచ్చరిస్తూ మగవాడి నీచత్వాన్ని తలుచుకొని ఆవేదన చెందుతారు "ఆడపిల్ల గా ఒక్కొక్క ఏడు//యుక్తవయసు నీకు పెరుగుతూ వుంటే/అమ్మ తన కొంగు ఓ కార్చిచ్చు ఉన్నట్టు //ఆడదాని జీవితం ఎప్పుడు రిస్కే/ఆడదాని  జీవితం ఎప్పుడు ఆక్సిడెంట్ //కరిచే వరకు తెలియదు మగవాడు పాము అని // ఇలాంటి పంక్తులు మనల్ని కట్టి పడేస్తాయి. "బయటకు అడుగు పెడుతున్నావు అంటే ఆత్మ గౌరవాన్ని  కన్న కలలని చెప్పుల తో తీసుకు వేడుతున్నట్టే // అని స్త్రీ పట్ట పగలు  తిరగలేని స్థితి ని తలచుకొని వాపోతారు .

//జీవితం లో నేను రాసిన ఆఖరి సంతకం నువ్వే అయినప్పుడు , జీవితం లో నీ స్థానం  ఏమిటో , నా స్థానం ఏంటో నేను పోయాక అర్థం కాదు, (ఒరేయ్ కొడుకా , నువ్వు ఇలా అయిపోయావు  ఏంటి )// అని తండ్రి పడే వేదన ని అర్థం చేసుకోవచ్చు. ఇదే  కవితలో "రేపటి కలల ప్రపంచం వాకిట/నువ్వు గర్వపడే //సమర గీతం గా కలకాలం నిలవాలని వుంది రా అంటూ ఆశ ని వ్యక్తం చేస్తారు  అలాగే తన దిశ ని, గమ్యాన్ని మార్చి వేసిన ఆప్త మిత్రులు   "స్నేహితులు వాళ్ళిద్దరు " లో వారితో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటారు  అమ్మ గొప్పతనం గురించి న కవిత "అమ్మ పాత చీరల బొంత"  చదివాక గోర్కి "అమ్మ" గుర్తుకు రాకపోదు ...

ఆత్మ వంచన చేసుకునే వాడికి ప్రపంచం తో పనిలేదు .ప్రబుత్వం తో పని లేదు హాయి గా బతికేయగలడు మనిషి అని "నాప్ కిన్ మనుషుల్లో " చదివినప్పుడు మానవ సంబందాలు అన్ని ఉత్తి వేనా అనిపించక మానదు.  ఈ దేశం తనని తానూ ప్రతి  నిత్యం అవమానపర్చుకుంటూ ఉంటుంది .  .ఎన్నుకోబడిన నాయకుల చేత రాజ్యాంగాన్నిచీపురు కట్ట గా చేసి , ప్రజా హక్కులని ఊడ్చెస్తారు నాయకుల చే మోసబడింది ప్రజలే కాదు దేశం కూడా అందుకే దేశం అవమానించబడటం కొత్తేమి కాదంటారు (నేను నిన్ను క్షమించను) కవితలో.  ఇక నాకు నువ్వు, నీకు నేను లో నువ్వు దుఖం   తో సంద్రం  గా మారిన నువ్వు ఈ దేశపు  స్వతంత్రానివి, విరహం  కోసమే పుట్టిన జాతి మనది అని ప్రేమ ని గుమ్మరిస్తారు .. 

ప్రజల జీవితాలన్నీ యుద్ధమయమైన సమయమైన, ప్రజల జీవితాలు రెండు అస్తమయాల  మధ్య మండిపోతున్న మానవ గోళాలు అవుతున్నప్పుడు తనలో తానూ, తన తో తానూ ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూ, వ్యవస్థ మార్పు కోసం, ప్రజల బాగు కోసం తపన పడే అక్షరాలను "మంత్ర లిపి" లో అందించారు.  
మొత్తం 54  కవితలు ఉన్న పుస్తకం లో "నువ్వు కన్న స్వప్నం", "ఒరేయ్ కొడుకా ", అవును మేమంతా ఒక్కటే మేమంతా  ఒకటే ", "మూడో పాదం" , "రక్తం లో  తడిసిన అక్షరం " "వాంటెడ్ " లాంటి మంచి కవితలు వున్నాయి .. భావుకత ని, వైరాగ్యాన్ని, వైయుక్తికాన్ని, వ్యవస్థ ని మార్చాలన్న కసి ని ఈ అక్షరాల్లో చూడొచ్చు ..
కొనకంచి గారు అద్భుతమైన కవిత్వాన్నే కాక మంచి నవలా  రచనల్ని కూడా లోగడ రాసి వుండటం విశేషం. ప్రజలను, వారి భాధలను అక్షరీకరించే కవులు కొంత మంది మాత్రమె వుంటారు ..ఆ కోవ లో కి కొనకంచి గారు ముందు ఉంటారు . 
మంత్ర లిపి  ప్రజల తల రాతలను కొద్ది గా అయినా మార్చ గలిగితే, మరిన్ని పుస్తకాలను వారి నుంచి ఆశించవచ్చును .

సాహిత్యం

"నేనేమీ మాట్లాడను....
............................
"A.COLLECTION OF POEMS
..................................................


నా కవిత్వంలో మాటలు మాటలు కావు..
మాటలన్నీ మనుషుల సంఘర్షణలు .
దిక్కుతెలీని దారుల్లో ..మానవ సమూహాల్లో ..
ఎవరికి వాళ్ళు ఒంటరిగా నిలబడి
బతికే దారి వెతుక్కుంటున్న మట్టి మనుషుల ..
ఆఖరి ఆర్త నాదాలే నాకవిత్వం...
ఆలోచించగల బుద్ధి జీవుల
అశాంతి..అలజడి..వేదనలు..రోదనలు సాగిస్తున్న
ఆత్మానుగత ..అంతరంగ ..వ్యధాత్మక..రాక్షసీక్రుత .. వ్యవస్థీక్రుత విక్రుతత్వాన్ని ..దహించటమే నా కవిత్వం
.............................
ఎవరికీ కనిపించకుండా
చావు ..బతుకుల మధ్య వయిరుధ్యాలే
మనుషుల జీవితాలు అయినప్పుడు
మనిషికీ..మనిషికీ మధ్య..
చిత్ర విచిత్రం గా ....
మరణ వేదన పడుతున్న..
రహస్య ..నిశ్శబ్దమే నాకవిత్వం..
..................................................
"నేనేమీ మాట్లాడను....
............................
"A.COLLECTION OF POEMS ..

"నేనేమీ మాట్లాడను"..కవితాసంపుటిలోంచి

సాహిత్యం


నేను....నా....మంత్రలిపి
..............................


నా చుట్టూ ఉన్న నా సమాజమే ..నాకవిత్వం..
నా చుట్టూ ఉన్న మనుషులే నా కవిత్వం
నా చుట్టూ ఉన్న ..నన్ను ద్వేషించే వాళ్ళే నాకవిత్వం.
నా చుట్టూ ఉన్న నన్ను ప్రేమించేవాళ్ళే నాకవిత్వం
.నా చుట్టూ ఉన్న అన్నివర్గాలూ నా కవిత్వమే .
నేను వేరు కాదు..నాకవిత్వం వేరు కాదు .
మనిషే నా కవిత్వం 
.....................................................................
అణగారిన వర్గాల్లో ఉన్న బాధ వేదన ..నాకు తెలుసు..ధనిక వర్గాల్లో ఉన్న బలుపులు..అహంకారాలు నాకు తెలుసు .ఏవరేం పోగొట్టుకున్నా రో సమాజం లో ఎవరేం పొందారో నాకు తెలుసు.
నాకు తెలిసిన విషయాలన్నీ నాకంటే ముందున్న మేధావులు..పార్టీలకు కట్టుబడి వర్గాలకు కట్టుబడి ..చెప్పలేకపోయారు .నేను వారిలా కాకుండా ..
సామాజిక శ్రేయస్సుకోసమే పార్టీలు కాని వ్యక్తిగతంగా ..నాయకుల ఆస్థుల్ని పెంచుకోవటానికి..నాయకులు దేశాన్ని అమ్ముతుంటే చూస్తూ ఉండటానికి కాదు..అని ఏ వర్గానికి ఏ పార్టీకి చెందకుండా..అన్నివర్గాలను..ముఖ్యంగా మనుషులను ప్రేమించే వ్యక్తిగా నేను సమాజంలో ఉన్న రుగ్మతలను ..నా కవితా సంపుటి మంత్రలిపిలో రాశాను.

సాహిత్యం

అది కొంత వరకు నిజమయిన కవిత్వలక్షణం
.....................................................................................................

సమాజాన్ని ప్రభావితం చేసే నిర్మాణాత్మక భావాలన్నీ ...ఎప్పుడూ ... అన్యులెవరూ గుర్తించని ఒంటరితనం లోంచే బయట పడ తాయి.
అందుకే నిర్మాణాత్మక..భావాలన్నీ స్వాభావిక ఒంరిటతనం తో ఒంరిటతనం నుంచి బయట పడాలని ..ఒంటరి తనం తో పోరాడుతూ..ఒంటరి తనం లోంచే జనిస్తాయి..
అందుకే ..స్వార్ధం లేని ..నిస్వార్ధ సమాజం కోసం స్వప్నిస్తూ ..జీవితాన్ని కవిత్వీకరించుకున్న నాలాంటివాళ్ళెప్పుడూ ఒంటరివాళ్ళే .
కారణం నాకు నేనే నే ఓ సిద్ధాంతాన్ని . 
నేను ఏ సిద్ధాంతాల్లోనూ ఇమడలేను.
సొంత వ్యక్తిత్వం ఉన్న నేను ..
ఎవరి భావాలకీ దాస్యం చేయలేను .
అందుకే ....
నా కవిత్వంలో ..వర్గ ప్రయోజనం ..వర్గ స్ప్రుహ ..యుద్ధ ప్రయోజనం ..యుద్ధ స్ప్రుహ లతో పాటు ..అంతర్లీనంగా ఎక్కడో ఒకచోట ఒక ఒంటరి తనం కూడా కనిపిస్తూ ఉంటుంది .
అది నాఒంటరి తనం కాదు .
అది కొంత వరకు నిజమయిన కవిత్వలక్షణం .
అనుభవించటం తెలియాలి కాని .. ఒంటరితనం కూడా..కవిత్వమే.
అందుకే కళలెప్పుడూ ..ఒంటరితనం లోంచే పుడతాయి

సాహిత్యం

ప్రజా హితమే మా జెండా.. అజెండా
...............................................

చెప్పులు మోయటానికే పుట్టిన వాళ్ళు ..చెప్పులు మోయటమే..తమ జీవితం అనుకునే వాళ్ళు ..చెప్పులు మోయటమే తమ ఆనందం అనుకునేవాళ్ళు ..తమ వారసులక్కూడా ..చెప్పులు మోయటాన్నే నేర్పే వాళ్ళు ..తాము చనిపోతే ..చెప్పులతొనే ..తగులబెట్టమనే వాళ్ళు
వాళ్ళుంటారు....
బ్రాండ్ అబాసిడర్స్ ..
బానిసత్వానికి..భజన గీతాలకి .. 
ఇలాంటి వాళ్ళు గత తరాల్లోనూ ఉన్నారు .ఈ తరం లోనూ. ఉన్నారు రేపతి తరాల్లోనూ ఉంటారు..
అలా బానిసలకు పుట్టిన పుట్టు వారస బానిసలు..ఎవరైనా ఉంటే ..దయ చేసి....నా ప్రొఫైల్ లోంచి ..వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి.మీ చావు చచ్చిపోండి ..
మేము మీ నీడను కూదా భరించలేము ..
మాకు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం .మాకు నాయకులు కాదు..వాళ్ళు చేసే పనులు ముఖ్యం..
ప్రజా హితమే మా జెండా.. అజెండా 
మేము ఈ దేశపు జెండాకి తప్ప ఎవ్వరికీ నమస్కరించము ..
అందుకే ..కులపిచ్చి ఉన్నవాళ్ళు ..మత పిచ్చి ఉన్నవాళ్ళు ..పక్క మనిషిని ప్రేమించలేనివాళ్ళు..నిజాన్ని ప్రేమించలేనివాళ్ళు ..ఈదేశాన్ని..ప్రేమించ లేనివాళ్ళు..దయచేసి..నా ప్రొఫైల్ వదిలి పెట్టి వెళ్ళి పోండి ..
మా అక్షరాల మిలిటెన్సీకి..మీ స్టాంపింగ్ అవసరంలేదు ..
మేము..మీ నీడను..బానిస భావజాలాన్ని ఒక్క సెకను కూడా భరించలేము . 
మీకు తెలుసా..మేము మరణించిన చోట ..జాలిపడి మీరు ..కొవ్వొత్తి వెలిగిస్తే .. రెండోసారి మేము
మరణిస్తాము ..
మా ఆక్షరాల వ్యక్తిత్వం అది...మా అక్షరాల పవిత్రత అది. 
.................................................................................................................................
త్వరలో విడుదల
అవుతున్న నా కవితా సంపుటి..
"నేనేమీ మాట్లాడను"
లోంచి కొంత భాగము

సాహిత్యం


 వీటినన్నిటినీ ప్రశ్నిస్తున్నట్టు కలర్ ఇవ్వండి


మీరు మెధావులుగా ..సమాజం లో గొప్పవాళ్ళుగా ..అభ్యుద్యవాదులుగా ..పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా?
మీడియాలో ..గొప్పవాడిగా .."కొత్త దేవుడిగా"కొలువొందాలనుకుంటున్నారా?
ెరీ సింపుల్ ..చాలా ఈజీ..డాక్టరేట్ సంపాయించటానికయినా కొన్నాళ్ళు కస్టపడాలి కాని ..మేధావి అభ్యుదయవాది అనిపించుకోవటానికి మాటలను అటు తిప్పి ఇటు.....ఇటు తిప్పి అటు మార్చి తెలివిగా మాట్లాడగలిగితే చాలు.
ముందుగా నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాలి.
తరువాత దేవుడు లేదు అనాలి. అటు తరువాత్..రామాయణం రంకు ..భారతం బొంకు అనాలి .హిందువులందరూ ఎధవలు అనాలి.
చుట్టూ ఉన్న ..హిందువులని..వాళ్ళ నమ్మకాలని..వాళ్ళ అస్థిత్వాన్ని కనపడ్డ ప్రతి వేదిక మీద ఎగతాళి చేయాలి.
దేశం ..దేశభక్తి అని మాట్లాడే ప్రతివాణ్ణి ..ఆర్ ఎస్సెస్ వాడు మతోన్మాది.. అని ముద్రవేయాలి.
బ్రాహ్మణులని ..సామాజ ద్రోహులు అనాలి .మనువాదం అనాలి. బ్రాహ్మణవాదం అనాలి.అగ్రవర్ణాలు అని..మీరు ..మీ వర్గం తప్ప అన్ని వర్గాలమీద దుమ్మెత్తి పోయాలి.
ఇలా కొన్ని సార్లు చేస్తే చాలు..మీవెనక కొంత మంది కమ్యూనిస్టులు చేరతారు .మీకు గొడుగులు పడతారు .అలాగే సహజంగా హిందువులైవుండి..మతం మారిన....రిజర్వేషన్ల పేరుతో ..ఉద్యోగాలు సంపాయించికూడా ..ఇరవయి నాలుగ్గంటలూ ..హిందూఇజం ..మీద రాళ్ళేసే ..అన్య మతస్థులు కూడా మీరు అడక్క పోయినా ..మిమ్మల్ని వాళ్ళల్లో కలుపుకోని..మీకు సన్మానాలు చేస్తారు .మీకు గొడుగులు పడతారు
మయినారిటీ ..మద్దతుగా ..గొడ్డుమాసం తింటే తప్పేంటి అనాలి.యజ్ఞ యాగాల్లో పశు బలు లు లేవా అనాలి
స్వెచ్చ అనాలి.
స్వాతంత్రం అనాలి.
సెక్యూలరిజం అనాలి
హిందూ మతాన్ని ఎంత అవమానిస్తే ..అంత గొప్పవాళ్ళయిపొతారు.
దీంట్లోనే ..ఉచ్చ పోయటం ..పురాణ సాహిత్యాన్ని నిప్పు పెట్టటం..పుష్కరాలు..వినాయకుడు పాలు తాగటం ..ఇంకా చాలా ఉన్నాయి.
ఎందుకు ..?అని వీటినన్నిటినీ ప్రశ్నిస్తున్నట్టు కలర్ ఇవ్వండి
........
మీరు గొప్పవాళ్ళయిపోతారు
ఏదాది తిరిగేసరికి ..మీకు గవురవ డాక్టేరేట్..వచ్చినా అస్చర్య పోనక్కరలేదు.
మిమ్మల్ని ఎవరైనా తిట్టినా ..విమర్సించినా..గుర్తు పెట్టుకొండి వాళ్ళు చాందసవాదులవుతారు .మతోన్మాదులవుతారు .ఆరెస్సెస్..అవుతారు

Pisaasu Movie Official Song

15, జనవరి 2016, శుక్రవారం

సమీక్షలు

నేటితరానికి మరో మహాప్రస్థానం ఈ.."మంత్రలిపి"కవితాసంపుటి 
...................................................
శ్రీశ్రీ తన మహా ప్రస్థానం సాగిస్తున్నప్పుడు "హరోం ! హరోం హర ! హర హర హర హర" అంటూ ఒక చిన్న బీజాక్షర మంత్రాన్ని ఉపదేశేసిస్తే , ఆబీజాక్షరానికి విస్తృతిని ఇచ్చి, దాన్ని విడమర్చి లిఖించిన పరిపూర్ణ మంత్రమె, కొనకంచి ఈ మంత్రలిపి.ఈయన ప్రతి కవిత ఒక నిజం.మనం తట్టుకోలేనంత నిజం.
అబద్దానికి అలవాటు పడిపొయి అదే నిజం అనే ఒక భ్రమతో ఆ అబద్దపు ప్రపంచంలో నిజం వెతుక్కొవటానికి ప్రయత్నం చేస్తూ ..వేలకు వేలఅబద్దాలలో మనకు నచ్చిన ఒక అబద్దాన్ని నిజం అనుకొనే అబద్దపు బ్రతుకులు బ్రతుకున్న మనకు నిఖార్సైన నిజం చూసినప్పుడు అదినిజం అనుకొనే ధైర్యం ఉండదు .అసలు దాన్ని నిజం అని గుర్తించే అవకాశం ఉండదు.అసలు ఆ నిజం ఉంటుంది అనే విషయం కూడా తెలియదు. కొనకంచి గారు ఆ నిజాల్ని మన కళ్ల ముందు పడేసి మనమెంత గుడ్డోళ్లమో మన కళ్ళకు చూపిస్తాడు. అసలు నిజం ఇదా అని మనల్నిఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత చీకటి గదిలో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని , మనల్ని మనం ఒకసారిచీకటితో కడుక్కొని వెలుగులోకి రావలనిపిస్తుంది. మనుషులందరూ వారి మనసులను నగ్నంగా మన కళ్ళముందు ప్రదర్శించుకుంటూతిరుగుతుంటారు .ఆ నగ్నత్వాన్ని తట్టుకొనే మానసిక ధైర్యం నీకుందా !!నువ్వొక కొత్త మనిషిలా మారతావు,నువ్వొక ఋషివవుతావు .ఆ ధైర్యం నీకు లేదా, నువ్వు మనుషులను చూసి భయపడతావు . కానీఇంత నిజాయితీని చూశాక నీలో ఉన్న మనిషితనం నిన్ను భయపడేలా చెయ్యదు .
కొనకంచి గారి రచనలలో అధివాస్తవికత (సర్రియలిజం) చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది .
" కాలం నల్ల లాంతరు పట్టుకొని 
చీకట్లో చీకటినివెతుక్కుంటూ 
బయల్దేరినప్పుదు " 
"తేలు కొండికి ..పాము కోరకి 
ఉండేది ప్రేమే అయితే
విషమే ఈ ప్రపంచాన్ని కొనే 

అతి గొప్ప వస్తువు కదూ... " 
"జీవితమంటే ...అనేకానేక కనిపించని మరణాలు " 
"వెలిగే దీపానికి ...తైలం ..దూరంగా ఉన్నట్లు " 
ఇలాంటి భావనలు కొనకంచి గారికి మాత్రమే సాధ్యం.
కొనకంచి గారి మాటలు కొరకంచులు నిప్పుల్ని మండిస్తూ ..ఆ మాటలు ..మనల్ని దహించి వేస్తాయి . అవిమనల్ని నిద్ర పోనీయవు.నిద్రలో కూడా మనల్ని వెంటాడతాయి ,వేధిస్తాయి మరోసారి నిద్రపోనీయకుండా ,నిద్రపోతున్న వారికి వేడి సెగ పుట్టించి నిద్రలేపుతాయి . "కూయకుండానే తొలికోడిని కోసేసిన
ఊరికి వేకువ ఎలా తెలుస్తుంది ?? “
" దశాబ్దాలనుండి దేశం మీద ప్రేమతో
మరణించిన వీరుల అంతిమ ఆర్తనాదాలు 
ఈదేశంలోనే నవ్వులపాలవటం నీకు తెలీదు "

ఆరోగ్యశ్రీ లో లేని సరికొత్త రోగాలు 
తెచ్చుకొని అర్ధాంతరంగా చావాల్సిందే " 
అంటూ మాటలతో ఫైర్ పుట్టించగలటం ఒకకొనకంచి గారి పెన్నుకే సాధ్యం .
ఈయన కవితల్లో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి, సమాజం మీద కత్తులు విసిరేసి మేల్కొలపటం చాలా మంది చేసింది , కానీ ఈయనపువ్వులు విసిరి కూడా లేపగలడు . "నా కలల ..ఇంద్ర ధనస్సుపై
నువ్వు కుచ్చుల పరికిణితో 
పరుగెడుతున్నట్లు అవుతుంది "
" నా కంఠం చుట్టూ చేతులు వేసి 
యుగళ గీతానికి మొదటి చరణమై
నువ్వు ..సుందరమో..సుమదురమో 
అని చెవుల్లో పాట పాడుతున్నట్లే ఉంది "
ఇంత సున్నితమైన భావనలు కూడా అంతే సూటిగా, వాడిగా చెప్పటం చాలా కష్టం . 
కవితల్లో విషాదాన్ని నింపటంలో కూడా కొనకంచి గారిదిఒక ప్రత్యేక శైలి
"నువ్వు ఎక్కి వెళ్ళిపోయిన రైల్వే స్టేషన్ 
చివరన నేను సిగ్నల్ గా మారి 
నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను "
"నువ్వు గుర్తు రాగానే 
ఎమరాల్డ్ పెదవుల మీద
ఓ నవ్వు వెలిసినట్లు . 
హృదయాన్ని తట్టిలేపే పువ్వుల వానలో ..
.మైమరిపించే చిరునవ్వుల జడిలో ..
నేను జల జలా తడిసిపోతాను "
"నేను ప్రయాణించే రైలెప్పుడూ నిర్జనంగానే ఉంటుంది .
. ఆ రైలు లో నేనొక్కడినే సుదీర్ఘ ప్రయాణికుణ్ణి "
ఇలా విషాదాన్ని, విరహాన్ని కూడా కొత్తగా చెప్పగలగతాడు .
జీవితాన్ని మోడరన్ గా జీవించమంటూనే విలువలు మర్చిఫోవద్దు అంటాడు. నాగరికత విశృంఖులత్వానికి మొదట బలయ్యేది స్త్రీనే కాబట్టిజాగ్రత్తగా ఉండమమని హెచ్చరించే పర్ ఫెక్ట్ ఫెమినిస్ట్. మనుషులు స్త్రీ ,పురుషుల్లా కాక టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లా మారిపొతే సమాజం మొత్తంబాస్టర్డ్స్ తో నిండిఫొతుంది అని కటువుగానే చెప్తాడు .
ఒక అమ్మాయికి పురుషాధిక్య సమాజం నుండి ఎలా కాపాడుకోవాలో చెప్తాడు. సగటు మనిషిలో ఉందే హిపోక్రసీ ని ఎండగడతాడు. తన సొంత ఊరిని చూసి చిన్నపిల్లాడైపోతాడు,
అమ్మ చిన్నప్పుడు కప్పిన పాత చీరల బొంతని చుట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు . స్నేహం పేరుతో జరిగే మోసాలు చెప్తాడులోకం తీరు ఎలా ఉందో తెలుసుకొని మసలుకోమంటాడు. మొత్తం మీద కవి సమాజానికి దిక్సూచి లాంటి వాడు అన్నట్లు ఈయన మత్రలిపిసమాజపు సంద్రంలో లంగరు వెయ్యటానికి వీల్లేని ఓడకు సరైన దిక్సూచి అవుతాడు, ఒక లైట్ హౌస్ అయి దారి చూపిస్తాడు యాదృచ్చికంగాజరిగిందేమో తెలియదు కానీ ఏ మంత్రమైన 108 సార్లు చదివితే చాలు అంటారు , ఇందులో సరిగ్గా 54 మంత్రాల్లాంటి కవితలున్నాయి.
ఇంత అద్భుతమైన కవితలను మనకందించిన కవి కొనకంచి గారికి ,శుభాభినందనలు

సమీక్షలు


కవిత్వం

భార్య

.......................
ట్రిబ్యూట్ టు ఏ ...వయిఫ్
.............
పురాతన శిథిల మానవ సమూహాల్లోంచి
ఓ ఆధునిక దివ్య మంత్రంలా
తాపసీక ..స్రుష్టి రహస్య అణువులన్నీ కూచోని
అస్థిత్వం కోసం పోరాడుతున్నఫ్ఫుడు ..
కనిపించని దివా..రాత్రి ..గతాల
అజ్ఞాతంలోంచి పుట్టిన...
యుగాల దాహార్తుల్లోంచి..మాత్రు బొధనల్లోంచి
పవిత్రత ..సవుశీల్యతలని
ఒక తరాన్నించి...మరో తరానికి
కానుకగా...జ్ఞాన సంపదగా ..దయివ్జాజ్ఞగా అందివ్వటానికి...
ఓ కొత్త ఊదారంగు ఆకాశంలా ..
ఓ కొత్త దివ్య గంధ పరిమళంలా..
అరి చేతిలో కురుస్తున్న తొలకరి కొత్త వానలా
అలా..అలా..అలా ..
నువ్వు పెళ్ళి పందిరిలోకి
అడుగు పెట్టావు .
శివధనుర్భంగానికి ముందు
సీతాదేవి రాముణ్ణి చూసిన తొలి చూపులా
జిలకర్ర ..బెల్లం నా తలమీద పెడుతూ
నువ్వు ..నా వయిపు చూసిన చూపుని
నిర్వచించి..వర్ణించటానికి ..నాదెగ్గిర మాటలు లేవే..
ఆ చూపులో..
వంద రకాల విద్యుత్ ఘాతాలు
ఆ చూపులో..
వంద రకాల..విద్యుత్ న్మాలలు.
అప్పుడే మలిసారి పుట్టిన
రెండు కొత్త శరీరాలమధ్య
అల్పపీడనం పుట్టినట్లు..
ఎంత వత్తిడి?ఎంత వత్తిడి?
పెళ్ళి సంకెళ్ళు వేసిన కొత్త బంధాల్లో
నీళ్ళయిపోయిన శరీరాలమీద
ఓడలు పరుగెత్తుతున్నట్లు
ఎంత బరువు?ఎంత బరువు?
చెప్పలేని అంతరంగ సందిగ్ధాలల్లో
చెట్లు మొలిచిన శరీరం మీద
సంజెవేళల్లో పక్షుల పాద ముద్రలని
మేల్కోని కనే కలలో
చిత్రంగా చూస్తున్నట్లు..భ్రమించటం
ఎంత స్రుష్టి వయిచిత్రం?
2 ..
నా లోపలి సముద్రపు హోరు
నాకే వినపడుతున్నఫ్ఫుడు ...
నాలోపలి తుఫాను రొద
నాకే తెలుస్తున్నప్పుడు..
శరీరం ..తెరుచుకున్న కిటికీలోంచి
ఒక ఒంటరి రెక్కల పక్షి నక్షత్రంలా ..
నా గదిలోపలి కొచ్చావు .వాలిపోయావు .
కలగన్న స్రుష్టి రహస్యాలన్నీ
ఒక్కసారే చేసిన దాడిలో..
ఇద్దరమూ గాయపడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో ఖేద పడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో మోద పడ్డాము..
మొదటిరాత్రి..మనమున్న గది
స్రుష్టికర్త ప్రశ్న పత్రం అయ్యింది.
కుప్పబోసిన...అవ్యక్తాల్లోంచి
శరీరాలు నిర్వచనా లయ్యాయి
శరీరాలు జవాబులుగా కూడా మిగిలిపొయాయి.
3
మూడు ముళ్ళు ..ఏడు అడుగులు
ఒక్క రాత్రితో నేను..నీకు..
కొత్త ఇల్లుగా మారాను.
నువ్వు..నా నా కొత్త ఇంటికి
శుభ సూచకంగా పెట్టిన దీపంగా వెలిగావు.
నేను...నువ్వు పక్క మీదనించి లేస్తూనే
కళ్ళకద్దుకునే తాళిబొట్టు నయ్యాను.
నువ్వు వేసే ప్రతి అడుగులో నేనున్నానంటూ
నీ కాలికి మట్టెలు గా మారాను.
నువ్వు చేసే ప్రతి పనిలో నేనున్నానంటూ
నీ చేతులకి గాజులుగా మారాను.
ప్రపంచం చూసే నీ నుదుటన
నేనున్నానంటూ నీ బొట్టుగా మారాను.
రేపటి ..దేశం కంటున్న భవిష్యత్తుగా
చూస్తుండగానే తల్లిగా ..నువ్వు..
మన.. స్త్రీ పురుషుల జంటకి గుర్తుగా కొత్త జెండా నెగరేశావు.
ప్రపంచంలో..నా..కొత్త వారసత్వనికి.
నన్ను మూలపురుషుణ్ణి చేశావు..
4
గడ్డ కట్టిన ఓ అభేద్య నిశ్శబ్దంలో
పురుడు పోసుకోవటం అంటే
నువ్వు చచ్చి బ్రతకటమే కదూ..
అమ్మ కడుపులోంచి..కొత్త ప్రాణి
బయటి ప్రపంచానికి నిష్క్రమించటమే కదూ ..
ఆసుపత్రి బయట క్రూర నిరీక్షణల అనంతరం
మన ..ఇద్దరి..వారసత్వాన్ని
గుప్పిళ్ళల్లో..గట్టిగా ..బిగించి పట్టుకుని
నిద్దర బోతున్న
ఓ అందమయిన మానవపువ్వులా
మనబాబు...
ఓ అందమయిన వెల్తురు పక్షిలా
మన బాబు ..
నువ్విచిన నీ ..కానుకేగా నాకు..
5
అదే పురిటి వాసన ..
అదే ఆముదం వాసన..
అదే సాంబ్రాణి వాసన..
అదే పాలు తాగే బాల వాసన
తల్లిగా ..నిన్ను చూసినప్పుడల్లా
పాతచీర ..గుడ్డ ఉయ్యాలలో
నన్ను మాసాల పసిబాలుణ్ణి చేసి
జోలపాడుతూ ..లాలి పాడుతూ..
నన్ను కన్న తల్లి ..మరోసారి..భార్య ..నీ..రూపంలో ..
నన్ను నిద్ర బుచ్చటానికొచ్చినట్లు కనిపిస్తుంది.
నీకంటూ ..నీకు నువ్వు ఏమీ మిగుల్చుకోకుండా
నీ ఇంటి పేరు కూడా మార్చేసుకున్నావు.
వేడి అన్నం మీద పడ్డ ..వెన్న ముద్దలా
నీ..నెత్తురు వెచ్చించి..
మా జీవితాల అగ్గిలో కరిగిపోయావు.
శుక్రవారం నాకంటే ముందే లేచి తలంటు పోసుకున్న
నా కొత్త ఉదయాని వయ్యావు.
శని వారం రోజున
నా ఒక్క పొద్దువి కూడా అయ్యావు .
ఇంటి ముందు పూల చెట్టువయ్యావు.
రోటి దెగ్గిర పచ్చడివయ్యావు .
పొయ్యిదెగ్గిర బొగ్గుగా మారిన కట్టె ముక్క వయ్యావు
దాహాని తీర్చేందుకు మట్టికుండగా మారావు
పండగ రోజున ..నాకూ ..పిల్లలకు..
కంచాల్లో పరవాన్నం అయ్యావు.
అమ్ముమ్మ వయ్యావు ..నానమ్మ వయ్యావు.
మనుమళ్ళకు..మనుమ రాళ్ళకు
కథలు చెప్పే చందమామ పుస్తకమయ్యావు .
6
జీవితం ...కత్తుల వంతెనమీద
నేను చేస్తున్న యుద్ధంలో..
యెప్పటికీ ఖాళీ కాని అమ్ముల పొదిలాగా
మారిపోయిన నీకు ..
నేను..క్రుతజ్ఞతలు మాటల్లో చెప్పాలంటే ..
నాకు రావణాసురుడిలా పది తలలు కావాలి.
చేతులు మోడించి క్రుత్జతలు చెప్పాలంటే
ఇరవయి చేతులు కొత్తగా మొలవాలి.
దేహం నించి..దేహానికి సాగిన ప్రయాణం అల్లా..
రూపాన్ని మార్చుకోని
ఆత్మ నించి ఆత్మకు ప్రయాణం
గా రూపాంతరమయ్యింది.
జీవితాన్ని నిర్వచించిన
నిబంధనలన్నీ చూస్తుండగానే గాలిలో కలిసిపోయాయి
బతుకు పోరులో ఎదురయిన
సంకెళ్ళన్నీ చూస్తుండగానే ముక్కలుగా విరిగిపొయాయి.
ముసలితనం తెచ్చిన స్వేచ్చలో
కాటికి కాళ్ళు జాపుకోని ..
ఏ బాదర బందీలేకుండా
చావుకోసం ఎదురు చూడటం
ప్రతిమనిషికీ ఆఖరి దశలో ఎదురయ్యే ఎంతటి నిత్య సత్యం??
7
ఎవరో వస్తున్నారు..ఎవరో వెళ్తున్నారు..
ఎవరో నన్ను..మంచం మీదనించి కింద పడుకోబెట్టమంటున్నారు ఏవేఓ అస్పస్ట ద్రుశ్యాలు..అస్పస్ట వాసనలు
అదిగో ..నా భార్య ..కొత్తపెళ్ళికూతురుగా వస్తున్నది..
అదిగో ..మా అమ్మలాగే ..నాకు అన్నం తినిపిస్తున్నది..
నా కొడుకులు..కోడళ్ళు వద్దు వద్దు..
అది ఎక్కడున్నది?ఎమేవ్?ఒసేయ్..ఎక్కడున్నావు..
నాకు అమ్మ వాసన వస్తున్నది
నాకు భార్య వాసన వస్తున్నది..
ఎవరో తులసితీర్ధం పోయమంటున్నారు..వినపడుతున్నది..
అతికస్టం మీద చూస్తే నా భార్య ..ముసలిది..ఏడుస్తూ.
నా నోరు తెరిచి నీళ్ళు పోస్తున్నది.
ఏడ్వబాకే ..ఏడవ బాకు ..
నీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నాను.
వచ్చే జన్మంటూ ఉంటే..
నీకు కొడుకుగా పుట్టి ..
నీ పయిట చెంగుతో ఆడుకుంటూ ...నీ పాదాలదెగ్గిర అంబాడుకుంటూ
ఈ జన్మలో భార్య రుణం ..
వచ్చేజన్మ లో అమ్మ ..రుణం..
ఒక్కసారే తీర్చుకుంటాను .
..................................................................

సమీక్షలు

ఒక
యుద్ధస్వరం కొనకంచి “మంత్రలిపి

సారంగ సాహిత్య వారపత్రిక నుంచి
ఎం. నారాయణ శర్మ రాజ్యం ఉనికిలోనుంచే,సమాజం ఉనికిలోనుంచే కొన్ని అపసవ్యదిశలున్నాయి.కాని ప్రపంచీకరణ తరువాత దీని భీకర రూపం ప్రభావం ఎక్కువ.ఈ పరిణామాలతరువాత మనిషి కేవలం ఆర్థికమానవుడుగా ఇంకాచెబితే, కేవలం సాంకేతికమానవుడుగా తయారయాడు.ఈ పరిణామాలు,పరిణామాలఫలితాలు ఈకాలపు కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి.వస్తుగతంగా “కొనకంచి”-మంత్రలిపి”కూడా దీనికి మినహాయింపుకాదు.కాని కవిత్వంలో కనిపించే సంవేదనాంశానికి,అస్తిత్వజిజ్ఞాసకు,ఈకవిత్వంలోఉండే భావావేశతీవ్రతకు మధ్య చెప్పుకోదగ్గ వైరుధ్యాలున్నాయి.వాక్యాల్లో ప్రస్ఫుటంగా వర్గస్పృహకాకుండా విశ్వాత్మలో చెల్లుబాటయ్యే సార్వజనీన తిరస్కరణనుచూడొచ్చు.
రాజ్యం యొక్క పట్టించుకోని తనాన్ని,లంచగొండితనాన్ని,స్వార్థంలాంటి అంశాలపై కవిత్వం రాసినా ఈవాక్యాలవెనుక ఉనికిసంబంధమైన పోరాటం ఉంది. రాజ్యపులక్షణాలను,రాజ్యం,ప్రపంచీకరణ రెండూ ప్రసారం చేస్తూ మానవీయమూలాలుదెబ్బతీసే ప్రతివ్యక్తీ,అంశం ఈకవిత్వంలో తిరస్కరింపబడుతాయి.అందులోనూ రాజ్యాన్ని ప్రథమశత్రువుగా చూడడం ఇందులో గమనించవచ్చు.అనేక కవితలు అందుకు నిదర్శనం కూడా.కొన్ని కవితల్లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలనుగురించి మాట్లాడటమూ గమనించవచ్చు.జీవితం పోరటమైన సందర్భాలలో మానవుని అస్తిత్వాన్ని గురించి” మంత్రలిపి” ఆలోచిస్తుంది.
అంశాత్మకంగాచూస్తే మానవీయలక్షణాల అణ్వేషణ,దానికి కారణాలను,కారకులను తిరస్కరించడం,క్షేమాన్ని కనిపెట్టాల్సిన రాజ్యపు స్వభావాన్ని,అందులోని దుర్నీతిని తిరస్కరించడం ప్రధానంగా ఎక్కువకవితల్లో కనిపిస్తుంది.

ప్రియురాలి హృదయంలో ప్రేమలేదు
ఉన్నదంతా ఒక అవసరం
ప్రియునిమనసులో ప్రేమలేదు
ఉన్నదంతా పచ్చిదేహభాష

నెచ్చెలిని కౌగిట్లోనిద్రపుచ్చే
మంత్రగాడిలా మారాలనుకున్నప్పుడల్లా
చీకటి పడీపడకముందే
తొలికోళ్ళు కూస్తున్నాయి

స్నేహాన్నినటిస్తూనే
నాకుతెలియకుండా నన్ను  ప్లాస్టిక్ పువ్వును చేసి
బతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్తమాంసాలని
ఎవరో ఎత్తుకుపోయారు“–(మంత్రలిపిపే.21/22)

ఈవాక్యాలన్నీ జీవితవిలువల్లోని చరమస్థాయిని చిత్రిస్తున్నాయి.మొదటివాక్యం జీవన సంబంధాలను ,రెండవవాక్యం బంధాలు దూరమవుతున్న క్రమాన్ని,మూడవభాగం మోసపోతున్న జీవితాలను వ్యక్తం చేస్తాయి.ఇవన్నీ జీవితపు విలువలను వ్యక్తం చేసినా వీటివెనుక ప్రపంచీకరణప్రభావాలను పరోక్షంగాప్రస్తావిస్తాయి.కేవలం అవసరంగామారడాన్ని,సమయంలేకపోవడాన్ని,మేలుచేస్తున్నట్టుగా కీడుచేయడాన్ని ఈవాక్యాలు గుర్తించాయి.నిర్మాణగతంగా ఇవి వస్తువుయొక్క సంవిధానస్థాయిని(the proairetic code) చెబుతాయి.ప్రపంచీకరణ నీడను గుర్తించడానికి ఈవాక్యాలు దోహదం చేస్తాయి.నిర్మాణగతంగా పూర్తిసమాజాన్ని చిత్రించే సంపూర్ణత్వం(Wholeness)దాన్ని అర్థంచేసుకోడానికి గతవర్తమానాలను పరిచయం చేసే పరిణామశీలం(Transformation)ఈ కవితల్లో కనిపిస్తాయి.వీటన్నిటి వెనుక రాజకీయస్పృహ గమనించదగింది.కొనకంచి వాక్యాలన్నీ రాజ్యాన్ని దాన్నీఅనుకొని ఉన్న స్వార్థాన్ని,దోపిడీని ఎక్కు పెట్టేవే.
ఉన్మాదుల..పాలకులచేతుల్లో/మనుషులజీవితాలన్నీ/రాళ్ళు రప్పలపాలయినప్పుడు/అధికారమే మారణాయుధాలతో/తనమనుషులను తానే చంపటానికి దండెత్తినప్పుడు/
మనుషులంతా నీళ్లలో తిరిగే చేపలవుతారు/తమప్రాణాలను కాపాడుకునేందుకు/తామేవెళ్ళికనపడుతున్న/నైలాన్దారాల్లో దాక్కుంటారు
 చుట్టూ ఉన్న ప్రపంచంలో/మనుషులంతా నడిచే నల్లనాగులుగా మారినప్పుడు/గుడ్డుగుడ్డులాగేఉంటుంది/గుడ్డులో పచ్చసొనమాయమవుతుంది/మనిషి మనిషిలాగే ఉంటాడు/మనిషిలో మనిషిమాయమవుతాడు/రాజ్యాంగం రాజ్యాంగం లాగే ఉంటుంది/రాజ్యాంగంలో అన్నీ తెల్లకాగితాలేమిగులుతాయి. -(మంత్రలిపిపే.23/24)
చట్టబద్ధంగా రాజ్యంచేసే హత్యలకు/అసలుహంతకులు/రాజ్యాంగం పేజీల్లోనే/అక్షరాలయిదాక్కున్నారు“-(పే.41.ఇది హత్యాత్మహత్య)
kona1
మొదటివాక్యం ప్రజలు తమకు తాముగానే (విధిలేని పరిస్థితుల్లో) బలి అవడాన్ని,రెండవ వాక్యం ప్రజలను బలితీసుకుంటున్న విధానాన్ని చెబుతుంది.ఇందులో రాజ్యం యొక్కప్రవర్తన గుర్తించడంలో కొనకంచిలో విప్లవచాయలున్నాయి.రాజ్యాంగంపైన దేశంలోని రాజకీయపార్టీలు సైద్ధాంతికంగాకానీ,ఆచరణరీత్యాకానీ,మానసిక ప్రవృత్తులవలనకానీ కట్టుబడిఉన్నాయన్న దాఖలాలు లేవు.అంతేకాక ప్రపంచీకరణలోని ప్రధానాంశం ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాల అభివృద్ధి(Development group for attentive policies)కి ప్రధానవాహికగా ఉన్నాయి.చిల్లరవర్తకాలపై పెట్టుబడులనాహ్వానించిన మొన్నటి కాంగ్రెస్ నుంచి,ఇప్పటివరకు ఉన్న రాజ్యాలన్నీ దీనికి మినహాయింపుకాదు.స్వాతంత్రాన్ని సంపాదించుకున్న చైతన్యం ఇలా వట్టిపోయిందనే అనాలి.కాడ్వెల్-ఒకమాటంటాడు.
 Consciousness is generated by men’s Active struggle with nature and perishes in a blind formalism once that grapple ceases
 (చైతన్యం ప్రకృతితో జరిగే మనిషిక్రియాశీలపోరాటం నుంచి పుడుతుంది.ఒకసారి అనుకున్నది సాధించాక ఆచైతన్యం ఒక గుడ్డి వ్యవస్థగా మారి నశిస్తుంది-(Illusion and Reality-పే 63).
వర్తమానస్థితిని చెబుతున్న కొనకంచివాక్యాలసారాంశమూ ఇదే.ప్రాచీనభారతీయ రాజనీతిశాస్త్రం రాజును రాజ్యాన్ని ఆరాధించే ప్రజలగురించి ప్రస్తావించింది.

ధార్మికం పాలనపరం సమ్యక్పరపురజ్ఞయః
రాజానామభిమన్యంతే ప్రజాపతిమివప్రజాః
 ఈలక్షణాలు లేని ధార్మికత్వం,ప్రజాగతపాలన లేనిరాజ్యాన్నే మంత్రలిపి నిలదీస్తున్నది..వస్తుగతంగా ఉద్వేగమున్నా కవిత్వీకరణలో హృదయాన్ని హత్తుకోగల కళాంశాలనేకంగా ఉన్నాయి.
 కాలం నల్లలాంతరుపట్టుకొని/చీకట్లో చీకటిని వెతుక్కుంటూ/బయల్దేరినప్పుడు“-(పే.37.అప్పుడుఎప్పుడో ఒకసారి)
 తనకంటే ముందుగా/తనచావే పుట్టిందని
ఇప్పటివరకు/ రైతూ గుర్తించలేదు“-(పే.42.ఇది హత్యాత్మహత్య)
 ఇలాంటివాక్యాల్లోని సంకేతాలు కళాదృష్టిని ప్రసారం చేయడమేకాకుండా వాస్తవికతను బలపరుస్తాయి.ఈ సంపుటిలో ఇలాంటివాక్యాలను అనేకంగా ఎత్తిరాయొచ్చు.ఇవన్నీ వాస్తవాన్ని ప్రతిఫలిస్తాయి.వర్తమాన రాజకీయ,సామాజిక పరిస్థితులపై  గొంతెత్తిన యుద్ధస్వరం కొనకంచి మంత్రలిపి.
                                                                   ___________  

సమీక్షలు

 నిప్పులను వెదజల్లే అక్షరాల లిపి !!

 మాలిక పత్రిక నుంచి

సమీక్ష: పుష్యమీ సాగర్
manthra ilpi
మంత్ర లిపి కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత వెలుగు చూసిన అక్షరాలు. చీకటి రాజ్యం పై దండెత్తిన కరవాలం. నిజం నిప్పు అయితే దాన్ని పట్టి చూపించే దమ్మున్న అక్షరాల సుమం ఈ మంత్రం లిపి. కొనకంచి లక్ష్మి నరసింహ గారు మంచి కధకులు, నవలాకారులే కాదు మంచి కవి కూడా. మొత్తం 54 కవితలలో తర తరాలు గా సాగుతున్న మానసిక బానిసత్వపు సంకెళ్ళని, పుచ్చిపోయిన రాజకీయ వ్యవస్థ ని కడిగిపడేసే కవిత్వాన్ని ధార గా అందించారు. ప్రజల జీవితాన్ని రాజ్యం యుద్ధం లో కి తోసినప్పుడు సైనుకుడి లా పోరాడాలి అంటారు. నాశనమైన మానవత విలువ లకి చిరు దీపమై నిలుస్తాను లిపి సాక్షి గా.. అని అన్యాయం పై తిరుగుబాటు జెండా ఎగరేసారు. చావు బతుకుల మధ్య ఓ చిన్న విరామ చిహ్నమే ఈ జీవితం, అంతటి వైరాగ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాడు అనుభవించాల్సిందే. నీతులు ఒకరికి చెప్పి తాము ఆచరించకపోవడంలో ఉన్న మతలబును “అజ్ఞాతం గా మనుషులంతా అణగారిన చోట” లో బాగా వివరిస్తారు.
ప్రొఫెసర్ కొడుకు పక్కా క్యాపిలిస్ట్ గా మారేందు కు విదేశాల్లో చంపుడు చదువులు చదువుకుంటే, దాస్ కాపిటల్ అబద్ధపు పుస్తకం అవుతుంది, ఇలా హిపోక్రసి ని నిలదీయగల దమ్ము సగటు మనిషి కి వస్తుందా…? లలో కత్తిని, పువ్వు ని రెండూ ఒకేసారి ఉపయోగించడం బహుశ మొదటి సారి చూస్తాం. ఓ పక్క సామాజిక అంశాలపై తమ గళాన్ని వినిపిస్తూనే మరో పక్క ప్రేమ భావన ని అనుభవిస్తారు. ఓ చోట ఎంత బాగుందో “నీ కోసం నేను సృష్టించుకొన్న వర్ణ ప్రపంచం లో నా అక్షరాలన్నీ, ఉయ్యాలలో ఊగుతున్న పసిపాపలు అయ్యాయి ” అని చెప్తూనే తన కోసం బ్రతకటం స్వప్నం అయినప్పుడు నా ప్రపంచమంతా ఉద్యానవనమే అంటారు. “నీ కోసం బ్రతకటమే ఓ స్వప్నమైనప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కో ఉద్యనవానమే కదా..(నువ్వు ఎవరు అనుకుంటున్నావు ?). ఇక “మంత్ర లిపి ” లో అమ్మక ద్రోహం మా ఇంటి పేరు , లంచం మా జన్మ హక్కు, అవినీతి మా జాతీయ సంపద, దేశం అంటే ఉత్తి నల్ల మట్టి, మనిషంటే పిడికెడు బూడిద మాత్రమే” ఈ దేశం లో పాతుకు పోయిన అవినీతి జాడ్యానికి సగటు మనుషులు అందరూ మట్టి లో కలిసి పోయారు …నిజమే దేశం అంటే ఇప్పుడు మట్టి మాత్రమె, మనుషులు కొట్టుకు పోయారు అవినీతి వరదల్లో.
ప్రజల అమాయకత్వాన్ని దోచుకొని కోట్ల కు పడగలెత్తిన నాయకుల వైఖరి ని చూస్తున్నప్పుడు ప్రతి రోజు కూడా ఒక దగ్ధ గీతం లాగానే అనిపిస్తుంది. రాజకీయ నాయకుని చేతి లో దేశం కాని, రాష్త్రం కాని ఎలా ఆట ఆడించే జంతువు గా మారిన క్రమాన్ని అక్షరాల్లో చదివినప్పుడు రక్తం మరుగుతుంది . ఓటర్లు కు తెలియకుండా వాళ్ళ ప్రాణాలని లాగేసుకుంటే, ప్రాణం లేని మనుషులు తమ ప్రాణాలెక్కడున్నాయా అని విలపిస్తే, ఐదేళ్ళ పాటు రాజ్యం మీద పడి వెతుక్కుంటూ వుంటారు. సగటు ఓటరు పరిస్థితి ని కళ్ళకు కట్టినట్టు చూపించలేదు. తిరిగి రాని వసంతం లో తన నుంచి దాటుకు పోయిన బాల్యాన్ని, నాన్న పంచిన అనుభూతులను గుర్తు చేసుకుంటూ “నేను దిద్దిన ఒనమాల పలక ఏ ద్వీపం లో ముక్కలు అయ్యిందో” అనుకోని కూడా అవి అవధులని దాటి ప్రపంచం మొత్తం విస్తరించడం బాగుంది అంటారు. పేదోడు కులం ఏమిటి ఆకలే, …అలాంటి పేదోళ్ళ కులం మేమంతా ఒక్కటే . డబ్బున్న వాడు పవ్మేంట్ మీద వాహనం తో తొక్కించినప్పుడు ఎవడికి చెప్పుకుంటారు వారి వేదనని? అది తన అక్షరం గా మలిచారు రచయిత. “పుట్ పాత్ అంటే సజీవత్వం అంతు దొరకని నవ్యత్వం, ఒకానొక నిండు చైతన్యం,” అని వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. పుట్ పాత్ మీద బ్రతికే జీవులు గొప్పగా పోరాడే యోదులే అని నిర్ధారిస్తారు . “దేశ సరిహద్దుల్లో సైనికుల లాగానే పుట్ పాత్ ల మీద బ్రతుకు యుద్ధం చేస్తా రు”. క్రింది స్థాయి ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి అన్న నిజం గుర్తుకు రాకపోదు (అవును మేమతా ఒక్కటే ).ఈ దేశం అవమానించ బడటం క్రొత్తేమీ కాదు. అలాగే ప్రజలు కూడా …మరుగు దొడ్లు కడిగేందుకు పనికి రాని మేధావులు వికృతమైన ఆలోచనలతో పెడ త్రోవ పట్టిస్తారు. వీటిని ఖండించిన తీరు అద్భుతం (నిన్ను నేను క్షమించను ) ..”ఇది రాత్రి కాదు” లో అమ్మటం కొనటమే తెలిసిన చోట కవిత్వమేమిటి, జీవితమేమిటి , అని వైయుక్తికం గా ప్రశ్నిస్తారు .
ఇప్పుడు పసి పిలలు, యువతులు అని తేడా లేకుండా ఆడ పిల్ల అయిన పాపానికి అత్యాచారాలకి ఘోరాలకి బాదితులు గా నిలబడటం నడుస్తున్న చరిత్ర ..గొప్ప దేశం లో ఆడ పిల్ల భద్రత అన్నది నీటి బుడగనే తల్లి అంటూ దేశం లో ఆడపిల్ల పై జరుగుతున్న దారుణాలని ఎండగడతారు
యుక్త వయసు నీకు పెరుగుతూ ఉంటే అమ్మ కొంగు లో కార్చిచ్చు ఉన్నట్లు, అర్థ రాత్రుళ్ళు ఉలిక్కి పడి నిద్ర లేచి నిన్ను చూసుకునేది అంటే ఇంట్లో వున్నా కూడా ప్రతి తల్లి కి భయమే నిజమే. నీకు తెలియదు అమ్మా… మనషులు ఎప్పుడో జంతువులు అయిపోయారు అంటూ మనిషి లో ని కాముకత్వం ఎంతటి క్రూర ప్రవృత్తి ని పెంచుతుందో చెప్పకనే చెప్పుతున్నారు ..(ఓ అమ్మాయీ అమేలియా ). తనని తన అక్షరాలని అక్కున చేర్చుకొని ..కవిత్వ దారలో ముందుకు తీసుకువెళ్ళిన రచయతలను ..తన కంటే ముందు తరం వాళ్ళని గుర్తు చేసుకునే క్రమం గొప్ప గా ఉటుంది.
“చాక్ పీస్ చిత్రాల్లా”, “కలాల తోటి”, “అబ్బో….నన్ను ఆకాశం లో కి చెయ్యెత్తి మరి ఆహ్వానించారు (నా ముందు తరం రచయతలు)”, “అపుడెప్పుడో దశాబ్దాల క్రితం నా ఉడుకు వయసు లో నువ్వు వేసిన గాలానికి చేపలా తగులుకున్న నేను అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా గిల గిల తన్నుకుంటూ వున్నాను” అని గతంలో ప్రేమ తాలూకు విషాదాన్ని మననం చేసుకుంటారు ..(నువ్వు, నేను, మన ప్రేమ).
కడుపు నిండా అన్నం పెట్టె రైతు నేడు ఆత్మ హత్య చేసుకోవాల్సిన స్థితి కి ఎందుకు దిగజారింది, దేవుళ్ళందరూ వున్నా ఇక్కడమనిషి కరువంటారు. రాజ్యాంగం అబద్దమైన చోట, బతుకులు అబద్దమైన చోట దేశం మాత్రమే నిజం అంటారు..
రైతు పండించే ధాన్యం నిజం, రైతు మాత్రం అబద్దం నిజమే …బువ్వ ని అందించే రైతు అబద్దం. ఈ దేశం లో అనే కవిత లో “నాయకుల ఇంట వెలుగుతున్న లాంతర్లలో ఇంధనం గా వెలుగుతున్నది చచ్చిపోయిన రైతు రక్తమే” ఎంత దారుణం, . అలాగే, “నేను అన్నం తిందాము అనుకుంటున్న ప్రతీసారి నా కంచం లో ఏ కన్న తల్లివో రెండు కన్నీటి బొట్లు జారి పడి మెరుస్తున్నాయి, నా కంచం లో ఆత్మ హత్య చేసుకున్న ఏ రైతు భార్య వో రోదిస్తూ తెగిపడ్డ పుస్తెలు కనిపిస్తున్నాయి, అనడం వెనుక ఎంత వేదన వున్నది !! చివరికి ఈ రైతు చచ్చిపోవడం అంటే దేశం చచ్చిపోవటమే, రైతు చచ్చిపోవటం అంటే రేపటి తరాలు చచ్చిపోవడమే (ఇది హత్యాత్మ హత్య )
తను ఎంతో ప్రేమించినవాడిని దేశం కోసం త్యాగం చెయ్యాల్సి వస్తే ఆ ఇంతి మనసు ఎలా తల్లడిల్లుతుంది ..”అదేంటో కళ్ళు మూసుకుంటే అన్ని రాకూడని కలలే వస్తాయి, కలలో ఎవరో తెల్ల చీర కట్టినట్టు కనిపిస్తుంది. చేతి గాజులను పగలగొట్టినట్టు అనిపిస్తుంది” అని ఆ వీరుడి భార్య దు:ఖిస్తూ ఉంటుంది (ఏమండీ ప్రియమయిన మీకు). ఇదే కవిత లో పోరు ముగిసాక ఈ రాజ్యానికి మనం ఎవరు? పోరు ముగిసాక మనం దిష్టి బొమ్మలు గా కూడా పనికి రామన్న నిజాన్ని వీరులు ఎందుకు గుర్తించరో అని వాపోతారు. దేశం వీరుల చావులని తమ స్వార్ధ ప్రయోజనాలకి వాడుకొని తరువాత మర్చిపోవడం కొత్త విషయము ఏమి కాదు కదా.
ఇంకా ఇందులో “కళ్ళు”, “చీకటి లో చీకటి “, “అనుభూతి ఒక శాపం” “నిన్నెలా మరువను” , పొగడరా “నీ తల్లి భూమి భారతి ని”, “అవును మేమంతా ఒక్కటే ” లాంటి మంచి కవితలు వున్నాయి. నేను పేర్కొన్న వి కేవలం కొన్ని మాత్రమే. ఒకసారి ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని చదివిన తరువాత మనలో కలిగే భావ సంఘర్షణ ని అడ్డు కట్ట వెయ్యడం అసాధ్యమే. కొనకంచి గారి కవితలు చాల వరకు సామాజికం గాను, వైయుక్తికం గాను, స్పూర్తిని నిమ్పేవి గాను మనకు కనిపిస్తాయి. ప్రజల పక్షాన నిలబడే రచన ఎప్పుడు పది కాలాల పాటు నిలుస్తుంది. ఆ కోవ లో కి ఈ “మంత్రం లిపి ” వస్తుంది అందు లో ఎలాంటి సందేహం లేదు ..

13, జనవరి 2016, బుధవారం

కవిత్వం

హంతకులంతా ..హత్యోచ్చాహంతో పండగ చేసుకున్నారు 

..................................................................................

హంతకులెవరో ..అసలు హంతకులకు తెలుసు.
హంతకులెవరో..ప్రభుత్వానికీ తెలుసు .
హంతకులెవరో పొలీసులకూ తెలుసు.
హంతకులెవరో..ప్రజలకీ తెలుసు .
అయినా..ఓ..ఎడారిలో ఉన్న చలిరాత్రి నిశ్శబ్దం ..మాట్లాడ టానికి భయం ..ప్రభుత్వాన్ని చూసి..భయం . ఎం మాట్లాడితే ఎం జరుగుతుందో అన్న భయం .తెలుగు దేశం ప్రభుత్వానికి నమ్మిన బంటుల్లాంటి పోలీసు అధికారులని చూసి..పత్రికలు కూడా నోరు మూసుకూన్న రోజులు . అలాంటిరోజుల్లో జరిగిన పింగళి దశరధరాం హత్యని ..పత్రికలన్నీ చిన్న వార్తగా ప్రచురించి చేతులు దులుపుకున్నాయి .
హంతకులంతా ..హత్యోచ్చాహంతో పండగ చేసుకున్నారు .
కానీ మేము..అప్పటి మా యూత్ కందరికీ పింగళి దశరధ రాం ..ఓ ..డిక్షనరీ..జర్న లిజంలోకి కొత్త కొత్త పదాలు ..కొత్తకోత్త మాటలు....తెలుగు నాట "కులగజ్జి " అన్న మాటను..వాడింది పింగళి దశరధ రామే.
అతడి పత్రిక .."ఎన్ కవుంటర్ "ఓ సంచలనం ..అంతవరకూ..చాదస్తం తో..బానిస భావజాలంతో బ్రతుకుతున్న ..అక్షరాలకు ..ఒక్కసారి ..చలనమొచ్చి . .తిరుగు బాటుచేస్తున్నట్లుండే ..పత్రిక ఎన్ కవుంటర్ . అతడిని వెతుక్కుంటూ సీతారాంపురం ..విజయవాడ వెళ్ళి కలిసి రావటం..మాకు ..మేము మర్చి పోలేని అనుభూతి వచనంలో అతడు దిగంబర కవి లాంటివాడు .
నీచమైన..నిక్రుష్టమైన ..అసహ్యమైన ..దరిద్రమైన ..నాయకులకు..పాలక వర్గాలకు ..అతడు సామూహిక శత్రువుగా మారటం తో ..అతడు హత్య గావింపభడ్డాడు . భయం భయం..ఎవరూ మాట్లాడటల్లేదు. .
అలాంటి పరిస్థితుల్లో నేను..పింగళి దశరధరాం మీద కవిత రాశాను.దాన్ని ప్రచురించటానికి భయపడ్డ ..పల్లకి పత్రిక..ఆ కవితను..అడ్వటరైజ్ రూపం లో ప్రచురించింది అయినా అలా ప్రచురించటం పెద్ద ధయిర్యమే అప్పట్లో .
ఇంతకీ అసలు విషయమేంటంటే..పింగళి దశరధరాం గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని ..నిన్న మొన్న ..చూసాను.ఏమీ లేదు.కాఋఅనం జాతీయ పతాకాన్ని తయారు చేసిన ..పింగళి వెంకయ్య మనుమడు..దశరధ రాం .అతడు అప్పట్లో నాద్రుష్టిలో హ్హీరో...అతగాడు బ్రాహమణుడు అవబట్టే .. ఎవరూ..బ్రాహమనులతో సహా పట్టించుకోలేదు ..
పింగళి వెంకయ్య జాతీయ పతాక ఆవిష్కర్త ..మనుమడు...ఆ కుటుంబం..అనుభవించిన కశ్టాలు...పగవాడికి కూడా రాగూడదు ..
జాతీయ జెండా సాక్షిగా ..ఆ కుటుంబం సర్వ నాశనమవుతున్నా ఎవరూ ..జాలిపడలేదు..పిడికెడు మెతుకులు కూడా సహాయం చేయలేదు.... మేధావి..కాలజ్ఞానమున్నవాడు ..మనిషిగా బ్రతకాలనుకున్నవాడు ..ఖచ్చితంగా ..సిగ్గు పడాల్సిందే ...